close
Array ( ) 1

తాజా వార్తలు

రాహుల్‌ బ్యాటింగ్‌, కీపింగ్‌ సరే ఇక బౌలింగ్‌ చేస్తావా

‘నామ్‌ ఏక్‌ కామ్‌ అనేక్‌’ అని ప్రశంసిస్తూ పంచ్‌ వేసిన ఆకాశ్‌ చోప్రా 

ముంబయి: న్యూజిలాండ్‌తో ఆఖరి వన్డేలో అద్వితీయ శతకం సాధించిన కేఎల్‌ రాహుల్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. బ్యాటింగ్‌ ఆర్డర్లో వెనక్కి వెళ్లినా అదరగొడుతున్నాడని మాజీలు, విశ్లేషకులు పొగుడుతున్నారు. జట్టు అవసరాల కోసం కీపింగ్‌ చేస్తున్న అతడు 50 ఓవర్ల క్రికెట్లో ఐదో స్థానంలో దిగుతున్నాడు. మంగళవారం 62 పరుగులకే మూడు వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడ్డ కోహ్లీసేనను అతడు ఆదుకున్నాడు. 113 బంతుల్లో 112 పరుగులు చేశాడు. తొమ్మిది బౌండరీలు, కళ్లు చెదిరేలా రెండు సిక్సర్లు బాదేశాడు. కెరీర్‌లో రాహుల్‌కు ఇది ఐదో శతకం కాగా ఆసియా ఆవల మూడోది కావడం ప్రత్యేకం. ఇక ఆసియా ఆవల శతకం బాదిన భారత రెండో వికెట్‌ కీపర్‌ సైతం అతడే.

బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఏదైనా, పిచ్‌ ఎక్కడైనా, అదనంగా వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలున్నా అద్భుతంగా ఆడుతున్న రాహుల్‌ను ఆకాశ్‌ చోప్రా అభినందించాడు. ‘నామ్‌ ఏక్‌.. కామ్‌ అనేక్‌’ అంటూ ప్రశంసించాడు. చివరి మ్యాచులో టీమ్‌ఇండియాకు వికెట్లు లభించకపోవడంతో ఓ పంచ్‌ సైతం వేశాడు. ‘రాహుల్‌తో కోహ్లీ... సోదరా, ఈ రోజు నువ్వు బౌలింగ్‌ కూడా చేస్తావా??’ అని ట్వీట్‌ చేశాడు. ప్రస్తుత పరిస్థితికి ఈ ట్వీట్‌ అద్దం పట్టింది. 297 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన కివీస్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. మార్టిన్‌ గప్తిల్‌ (66; 46 బంతుల్లో 6×4, 1×6) 29 బంతుల్లోనే అర్ధశతకం బాదాడు. మరో ఓపెనర్‌ హెన్రీ నికోల్స్‌ సైతం అర్ధశతకం పూర్తిచేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యం అందించారు. 16.3వ బంతికి గప్తిల్‌ను ఔట్‌ చేయడం ద్వారా చాహల్‌ ఈ జోడీని విడదీశాడు. అప్పటి వరకు వికెట్లు పడలేదు. అందుకే చోప్రా ఇలా ట్వీట్‌ చేశాడు.

చదవండి: రెండో ఓటములు.. ఒక గుణపాఠం


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.