ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు
close

తాజా వార్తలు

Updated : 26/01/2021 14:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

విజయవాడ: నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.  అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నబాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతానికి కొన్ని శక్తులు యత్నిస్తున్నాయి. శాంతిభద్రతలు దెబ్బతీసేలా కొన్ని ఘటనలు జరిగాయి. మతపరమైన వివాదాల సృష్టికి కొందరు కుట్రపన్నారు. ఆ కుట్రలను సమర్థంగా అడ్డుకోగలిగాం. అభివృద్ధి కేంద్రీకరణ గతంలో ఇబ్బందులు సృష్టించింది. ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణను కీలకంగా భావిస్తోంది. ప్రాంతీయ సమానతల కోసం 3 రాజధానులు అవసరం. విశాఖను పాలనా రాజధానిగా చేయాలని భావిస్తున్నాం. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. కర్నూలును న్యాయ రాజధానిగా చేయదలిచాం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం అన్ని రంగాలపై దృష్టి సారించాం. కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొని కేంద్రం ప్రశంసలు  పొందాం. కొవిడ్‌ వేళ నిత్యావసరాలు కిసాన్‌ రైలు ద్వారా రవాణా చేశాం. రైతుల సౌలభ్యం కోసం 10,641 ఆర్బీకేలు ఏర్పాటు చేశాం’’ అని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ వివరించారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని