ప్రభుత్వ వైఖరే హత్యలకు కారణం: రేవంత్‌
close

తాజా వార్తలు

Published : 18/02/2021 19:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభుత్వ వైఖరే హత్యలకు కారణం: రేవంత్‌

దిల్లీ‌: న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్యకు ప్రభుత్వ వైఖరే కారణమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. అక్రమ తవ్వకాలు, ఇసుక మాఫియా లాంటి చాలా అంశాల్లో స్థానిక తెరాస నేతలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. అందువల్లే అక్రమార్కులు రెచ్చిపోయి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులను వాదిస్తున్నారనే అక్కసుతోనే వామన్‌రావు దంపతులను హత్య చేశారన్నారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ కేసులో కొంత మందినే నిందితులుగా చూపించి అసలైన వారిని తప్పించేందుకు యత్నిస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. ప్రశ్నించిన వారిని అణగదొక్కాలని, చంపేయాలని చూస్తున్నారని.. దానికి ఈ హత్యే నిదర్శనమన్నారు. ప్రాణహాని ఉండటంతో రక్షణ కల్పించాలని న్యాయవాద దంపతులు కోరినప్పటికీ ఎలాంటి రక్షణ లేకపోవడంతోనే హత్యకు గురయ్యారని ఆయన ఆరోపించారు. ఈ హత్యల వెనక తెరాస నాయకుల పాత్ర ఉందని చెబుతున్న భాజపా.. కేంద్రం సాయంతో చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తోందని ప్రశ్నించారు. ఈ హత్యల విషయంలో కేంద్ర హోంశాఖకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని