పోలీసుల అదుపులో చోరీ యత్నం నిందితుడు
close

తాజా వార్తలు

Updated : 28/03/2021 13:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలీసుల అదుపులో చోరీ యత్నం నిందితుడు

తిరుపతి: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి యత్నించిన నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నిందితుడు ఆదిలాబాద్‌కి చెందిన మైనర్‌గా గుర్తించారు. ఇంటి నుంచి పారిపోయిన బాలుడు తిరుపతికి వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. డబ్బుల కోసమే నిందితుడు హుండీ తెరిచినట్టు గుర్తించారు.  నిందితుడు తప్పును అంగీకరించడంతో అదుపులోకి తీసుకున్నారు.

ఏం జరిగిందంటే?
శుక్రవారం రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ ముగిసే సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన దుండగుడు.. ఆలయం మూసివేసే సమయంలో ఎవ్వరికీ కనిపించకుండా దాక్కొని..రాత్రంతా ఆలయంలోనే ఉండిపోయి దొంగతనానికి ప్రయత్నించడం చర్చనీయాంశమైంది. శనివారం ఉదయం ఆలయంలోకి వచ్చిన సిబ్బంది ధ్వజస్తంభం వద్ద ఉన్న హుండీ సీల్‌ తీసి ఉండటాన్ని గమనించి..రాత్రి విధుల్లో ఉన్న నిఘా సిబ్బందిని ఆరా తీశారు. దీనిపై తితిదే నిఘా సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్రైం డీఎస్పీ మురళీధర్‌ ఆలయానికి చేరుకొని పరిశీలించారు. మరోవైపు విష్ణునివాసం కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లోని సీసీ టీవీ దృశ్యాలను విజిలెన్స్‌ అధికారులు తనిఖీచేశారు. అనంతరం డీఎస్పీ మీడియాకు వివరాలను వెల్లడించారు. రాత్రంతా ఆలయం లోపల ఉన్న ఓ వ్యక్తి అర్ధరాత్రి ధ్వజస్తంభం వద్ద ఉన్న హుండీలో చోరీకి యత్నించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయని వివరించారు. ఆలయంలో అన్ని చోట్లా తాళాలు వేసి ఉండటంతో దొంగ ప్రయత్నాలు ఫలించలేదు. ఉదయం సుప్రభాత సేవలో భక్తులను ఆలయంలోకి అనుమతించిన తర్వాత వారితో కలిసి బయటకు వెళ్లిపోయాడు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని