close

తాజా వార్తలు

Updated : 09/03/2021 13:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ ‘బేబీ కిల్లర్‌’ను విడుదల చేయండి

90 మంది శాస్త్రవేత్తల విజ్ఞప్తి

సిడ్నీ: క్యాథలిన్‌ ఫోల్‌బిగ్‌.. నలుగురు కన్న బిడ్డలను హత్య చేసిందన్న నేరంపై 18 ఏళ్లుగా జైల్లో మగ్గుతోంది. 1990ల్లో ఆస్ట్రేలియాలో సంచలనం సృష్టించిన ఈ కేసు వల్ల క్యాథలిన్‌పై ‘బేబీ కిల్లర్‌’.. ‘ఆస్ట్రేలియాస్‌ మోస్ట్‌ వరస్ట్‌ ఫీమేల్‌ సీరియల్‌ కిల్లర్‌’ ముద్ర పడింది. కఠినాత్మురాలికి కఠిన శిక్ష విధించాలని అందరూ కోరుకున్నారు. అందుకు తగ్గట్టుగానే 2003లో కోర్టు ఆమెను దోషిగా తేల్చి 30ఏళ్ల కారాగారశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో అప్పటి నుంచి ఆమె జైల్లోనే జీవితం గడుపుతోంది. అయితే, తాజాగా 90మంది శాస్త్రవేత్తలు క్యాథలిన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతున్నారు. ఆమె హత్యలు చేయలేదని.. ఇందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు న్యూసౌత్‌వేల్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ పిటిషన్ ఇచ్చారు.‌ 

ఆస్ట్రేలియాకు చెందిన క్యాథిలిన్‌కు కాలెబ్‌(19 రోజులు), పాట్రిక్‌(8 నెలలు), సారా(10 నెలలు), లారా(19 నెలలు) అనే నలుగురు పిల్లలున్నారు. వారంతా తొమ్మిదేళ్ల కాలంలో(1991 నుంచి 1999 వరకు) నిద్రలోనే ప్రాణాలు విడిచారు. ఈ మరణాలపై, క్యాథలిన్‌ తన డైరీలో రాసుకున్న అంశాలపై అనుమానంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటి పరిస్థితులు.. ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి చిన్నారుల్ని క్యాథలినే చంపిందని నిర్థారించారు. కానీ, తాను తన బిడ్డల్ని చంపలేదని, సహజంగానే మరణించారని ఎంత చెప్పినా క్యాథలిన్‌ మాటలని ఎవరూ నమ్మలేదు. తనకు ఆ హత్యలు చేయలేదని నిరూపించుకునే అవకాశమే లభించలేదు. దీంతో కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించింది.

అయితే, ఇప్పుడు ఆమె నేరస్థురాలు కాదని, తను చెప్పినట్లు ఆ పిల్లలవి సహజ మరణాలేనని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు. క్యాథలిన్‌ పిల్లలకు వంశపారపర్యంగా వచ్చే జన్యుపరమైన సమస్యలున్నాయట. పాట్రిక్‌కు మూర్ఛ, కాలెబ్‌కు శ్వాసతీసుకోవడం ఇబ్బందులు ఉన్నాయని, సారా.. లారాలో CALM2 అనే జన్యుపరివర్తన ఉందన్నారు. దీని వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇవే ఆ నలుగురు చిన్నారుల హఠన్మరణాలకు కారణమని శాస్త్రవేత్తలు వెల్లడిస్తూ.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను పిటిషన్‌లో పేర్కొన్నారు. నిర్దోషి అయిన క్యాథలిన్‌ను విడుదల చేయాలని కోరుతున్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి..!


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని