తాగడానికి తగని సమయముంటదా..!
close

తాజా వార్తలు

Published : 19/01/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తాగడానికి తగని సమయముంటదా..!

సోషల్‌ లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

* అక్కినేని హీరో నాగచైతన్య రేసర్‌ అవతారమెత్తాడు. మళ్లీ తిరిగి ట్రాక్‌ మీదకు రావడం సంతోషంగా ఉందంటూ ఫొటోలు పంచుకున్నాడు. 

* కాఫీ తాగడానికి తగని సమయమంటూ ఉండదంటున్నాడు మెగా హీరో వరుణ్‌తేజ్‌. తాను కాఫీ తాగుతున్న ఒక ఫొటోను పంచుకున్నాడు. 

* లైట్స్‌.. కెమెరా.. యాక్షన్‌ అంటున్నాడు మాస్‌ మహారాజ్‌ రవితేజ. అదేంటీ ఆయన డైరెక్టర్‌గా మారాడా..! అని ఆశ్చర్యపోకండి. తన తర్వాతి సినిమా ‘ఖిలాడి’ సెట్లో జరుగుతున్న షూటింగ్‌ తీరును ఆయన అభిమానులతో పంచుకున్నారు.

* కొత్త పెళ్లికూతురు నిహారిక దగ్గర ఏదో రహస్యం ఉందట. ‘కానీ.. నేను మీకు రహస్యం చెబితే అది రహస్యం ఎలా అవుతుంది. అందుకే.. సారీ’ అంటూ తన పెళ్లి ఫొటోను జోడించి ఒక ఫన్నీ పోస్టు చేసిందామె.

* చాలాకాలం తర్వాత మళ్లీ తమ స్వస్థలానికి వచ్చినట్లు ఉందని నటి లారాదత్తా అంటోంది. తన భర్త భారత టెన్నిస్‌ దిగ్గజం మహేశ్‌భూపతితో కలిసి ఆమె థియేటర్‌కు వెళ్లి సినిమా చూశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని