100 మీటర్ల పరుగు ఈసారి 8.78 సెకన్లలోనే..
close

తాజా వార్తలు

Published : 29/03/2021 17:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

100 మీటర్ల పరుగు ఈసారి 8.78 సెకన్లలోనే..

బెంగళూరు: అభినవ ఉసేన్‌ బోల్ట్‌గా గుర్తింపు పొందిన కంబళ వీరుడు శ్రీనివాస గౌడ మరో రికార్డు నెలకొల్పాడు. గతేడాది 9.55 సెకన్లలో 100 మీటర్ల పరుగు పూర్తిచేసి వార్తల్లో నిలిచిన శ్రీనివాస గౌడ ఇప్పుడు 8.78 సెకన్లలోనే పూర్తిచేసి ఆ రికార్డును తిరగరాశాడు. ఆదివారం కర్ణాటకలోని బంత్వాల్‌ తాలూకా పరిధి కక్యపడవ గ్రామంలో మైరాసత్య సంస్థ నిర్వహించిన 125 మీటర్ల పరుగును 11.21 సెకన్లలోనే పూర్తిచేయగా దాన్ని 100 మీటర్లకు లెక్కగట్టి 8.78 సెకన్లలోనే పూర్తిచేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. గతవారమే వెళ్తాంగండి పరిధిలో నిర్వహించిన కంబళ పోటీల్లో 100 మీటర్ల రేసును 8.96 సెకన్లలో పూర్తిచేశాడు శ్రీనివాస గౌడ. వారం తిరగక ముందే తాను నెలకొల్పిన రికార్డును తానే బద్దలుకొట్టాడు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని