Samantha: రెండు యూట్యూబ్‌ ఛానళ్లపై సమంత పరువునష్టం దావా

తాజా వార్తలు

Updated : 21/10/2021 10:13 IST

Samantha: రెండు యూట్యూబ్‌ ఛానళ్లపై సమంత పరువునష్టం దావా

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేశారంటూ సినీ నటి సమంత కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించారు. డాక్టర్‌ సీఎల్‌ వెంకట్రావుతో పాటు సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీ యూట్యూబ్‌ ఛానళ్లపై పరువునష్టం దావా దాఖలు చేశారు. అక్కినేని నాగచైతన్యతో ముగిసిన తన వైవాహిక జీవితానికి సంబంధించి ఆ రెండు ఛానళ్లలో వెంకట్రావు అసత్య ప్రచారాలు చేస్తూ కించపరిచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసత్య వ్యాఖ్యలు చేశారన్నారు. మీడియా, పత్రికల ద్వారా వారు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. మరిన్ని వివరాలు సేకరిస్తున్నానని.. పరువు నష్టం ఎంతనేది తర్వాత కోరతానన్నారు. ఇకపై దుష్ప్రచారం చేయకుండా మధ్యంతర ఆదేశాలివ్వాలని, ప్రసారమైన ఇంటర్వ్యూలను తొలగించేలా ఆదేశించాలని కోరారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని