AP News: తండ్రి పిలిచాడని వెళుతూ.. అనంతలోకాలకు

తాజా వార్తలు

Updated : 26/07/2021 08:19 IST

AP News: తండ్రి పిలిచాడని వెళుతూ.. అనంతలోకాలకు

చెట్టును ఢీకొని ప్రభుత్వ వైద్యుని దుర్మరణం


విజయకుమార్‌ (పాత చిత్రం)

పొదిలి గ్రామీణం, న్యూస్‌టుడే: ‘బిడ్డా. నిన్ను చూడాలని ఉంది. ఒకసారి వచ్చి వెళ్లవూ...’ అనే తండ్రి కోరిక మేరకు కారులో స్వగ్రామానికి బయలుదేరిన అతన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు పొట్టన పెట్టుకుంది. ఈ దుర్ఘటన పొదిలి మండలం మాదాలవారిపాలెం- సలకనూతల గ్రామాల మధ్య ఆదివారం చోటుచేసుకుంది.

తర్లుపాడు మండలం రాగసముద్రం(రామక్కపల్లి) గ్రామానికి చెందిన మాజీ సర్పంచి రావూరి జయప్రసాద్‌, గ్రేసమ్మల మొదటి కుమారుడు విజయకుమార్‌(47). దర్శి మండలం చందలూరు పీహెచ్‌సీలో వైద్యునిగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులను చూసేందుకు స్వగ్రామానికి కారులో బయలుదేరారు. పొదిలి నుంచి కొనకనమిట్ల వైపు వెళ్తుండగా.. మాదాలవారిపాలెం- సలకనూతల గ్రామాల మధ్య రహదారిపై గేదెలు అడ్డుగా వచ్చాయి. వాటిని తప్పించబోయే క్రమంలో కారు వేగంగా పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొని బోల్తా పడింది. విషయాన్ని గమనించిన గేదెల కాపరులు కారులో ఇరుక్కుపోయిన విజయకుమార్‌ను బయటికి తీశారు. అప్పటికే అతను మృతిచెందినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న పొదిలి ఎస్సై శ్రీహరి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. వైద్యుడు విజయకుమార్‌ గతంలో పొదిలి సామాజిక ఆరోగ్య కేంద్రం, కొనకనమిట్ల పీహెచ్‌సీలో పనిచేశారు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల నిర్వహణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కొనకనమిట్ల పీహెచ్‌సీలో పనిచేస్తున్న సమయంలో రెండు సంవత్సరాల్లో పదిహేను వందల కు.ని. శస్త్ర చికిత్సలు చేశారు. ఇందుకుగాను రెండు సార్లు ఆయన రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని