close

తాజా వార్తలు

Published : 18/06/2020 13:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు ఏర్పాట్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభ ప్రాంగణంలో పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. రేపు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సాయంత్రం 6గంటలకు రిటర్నింగ్‌ అధికారి ఫలితాలు వెల్లడిస్తారు. బరిలో తెదేపా నుంచి వర్ల రామయ్య , వైకాపా నుంచి పరిమళ్‌ నత్వాని, ఆయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాస్‌చంద్రబోస్‌ ఉన్నారు.

ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులకు మాక్‌పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఓటు ఎలా వేయాలన్న అంశంపై చీఫ్ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి శిక్షణ ఇవ్వనున్నారు.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని