సచివాలయం కూల్చివేతపై స్టే పొడిగింపు
close

తాజా వార్తలు

Updated : 16/07/2020 13:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సచివాలయం కూల్చివేతపై స్టే పొడిగింపు

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయం కూల్చివేతపై ఇచ్చిన స్టే ను హైకోర్టు రేపటి వరకు పొడిగించింది. కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం  దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నిన్న విచారణ సందర్భంగా సచివాలయ భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతి అవసరమా? లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని కోరింది. దీనికి సంబంధించి ఇవాళ
పీసీబీ, రాష్ట్రస్థాయి పర్యావరణ మదింపు అథారిటీ సమర్పించిన నివేదికలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. సూటిగా సమాధానం చెప్పకుండా తెలివిగా నివేదికలు ఇచ్చాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

నిర్మాణానికి భూమిని సిద్ధం చేయడమంటే ఏమిటి? పాత భవనాలు కూల్చడమంటే కొత్త నిర్మాణానికి సిద్ధం చేయడమే కదా?. కూల్చివేతలకు పర్యావరణ అనుమతి అవసరమా? లేదా? అని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్ర పర్యావరణ శాఖ నుంచి తమకు సమాచారం రాలేదని అసిస్టెంట్‌ సోలిసిటర్‌ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు. సోమవారం వరకు సమయం ఇవ్వాలని కోరారు. ఈవివాదంలో కేంద్ర ప్రభుత్వం స్పందన కీలకమని అభిప్రాయపడిన ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని