ఆ వార్తలు అవాస్తవం: వరవరరావు అల్లుడు
close

తాజా వార్తలు

Updated : 02/07/2020 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ వార్తలు అవాస్తవం: వరవరరావు అల్లుడు

హైదరాబాద్‌: భీమా కోరేగావ్‌ కేసులో అరెస్టయి తలోజా జైలులో ఉన్న విరసం నేత వరవరరావు ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. జైలులో ఉన్న వరవరరావు ఈ రోజు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశారని వరవరరావు అల్లుడు వేణుగోపాల్‌ మీడియాకు వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ములాఖత్‌లు లేనందున వారానికి ఒకసారి ఫోన్‌ చేసుకొనే సౌకర్యం అధికారులు కల్పించారు. దీంతో ఈ రోజు ఉదయం వరవరరావు తన భార్యకు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆయన మాటతీరును బట్టి అనారోగ్యంగా ఉన్నట్టు గుర్తించాం. వరవరరావు ఆరోగ్యంపై జైలు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. జైలు అధికారుల నుంచి సమాచారం వచ్చినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం. ముంబయిలో బెయిల్‌ కోసం కింది కోర్టులో వేసిన పిటిషన్‌ తిరస్కరణకు గురైంది. దీంతో హైకోర్టును ఆశ్రయించాం. రేపు విచారణకు వస్తుంది. వరవరరావు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు’’ అని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని