IND vs AUS Fourth Test: నాలుగో టెస్టు డ్రా.. 2-1తో భారత్‌దే సిరీస్‌

IND vs AUS Fourth Test: అహ్మదాబాద్‌ వేదికగా బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) భారత్ - ఆసీస్ జట్ల మధ్య (IND vs AUS) నాలుగో టెస్టు మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. దీంతో సిరీస్‌ 2-1తో భారత్‌ వశమైంది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులు చేసింది. బదులుగా భారత్‌ 571 పరుగులు కొట్టింది. రెండో ఇన్నింగ్స్‌లో కంగారూలు 175/2 దగ్గర ఉండగా ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణయం తీసుకొని మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. 

Updated : 13 Mar 2023 15:41 IST