close

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో హిందూ మహిళ 

పోటీకి దిగాలని తులసి గ్యాబర్డ్‌ నిర్ణయం

వాషింగ్టన్‌: అమెరికా తదుపరి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకున్నట్లు డెమోక్రటిక్‌ నేత, కాంగ్రెస్‌లోని హిందూ సభ్యురాలు తులసి గ్యాబర్డ్‌ వెల్లడించారు. వారంలోగా ఈ విషయంపై అధికారిక ప్రకటన చేస్తానని ఆమె వివరించారు. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తాను మరోసారి బరిలోకి దిగుతానని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించారు. ఆయన్ను ఢీకొట్టేందుకు డెమోక్రటిక్‌ నేతలు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఆ పార్టీ ప్రాతినిధ్యం కోసం 12 మంది దాకా నేతలు పోటీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జాబితాలో భారత సంతతి సెనేటర్‌ కమలా హ్యారిస్‌ పేరు కూడా ఉంది. హవాయి నుంచి ఇప్పటివరకూ తులసి నాలుగు సార్లు అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. 2012లో కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందువుగా ఆమె ఘనత సాధించారు. అమెరికా సైన్యంలో పనిచేసిన అనుభవమూ తులసికి ఉంది. ఇరాక్‌ యుద్ధంలో ఆమె పాల్గొన్నారు.  అమెరికాలోనే పుట్టిపెరిగిన తులసి యుక్త వయసులో ఉండగా హిందూ మతాన్ని స్వీకరించారు.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.