Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 121035
            [news_title_telugu_html] => 

సర్కారులోకి షా!

[news_title_telugu] => సర్కారులోకి షా! [news_title_english] => [news_short_description] => తాజా ఎన్నికల్లో అఖండ విజయంతో ఉత్సాహంగా ఉన్న భాజపా రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ప్రధానమంత్రి, మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈనెల 30న ఉండవచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీని తమ నేతగా ఎన్నుకొనేందుకు భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ఎంపీలంతా శనివారం సమావేశం కానున్నారు. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని భాజపా తెలిపింది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => https://www.youtube.com/embed/CPk47P9vJmg [news_videoinfo] => https://www.youtube.com/embed/CPk47P9vJmg [news_sections] => ,27,26, ) )
సర్కారులోకి షా! - EENADU
close
సర్కారులోకి షా!

కేంద్ర కేబినెట్‌లో అమిత్‌ షాకు కీలక పదవి
జైట్లీ, సుష్మాలకు అనుమానమే
పలువురు కొత్త వారికి అవకాశం
తెలంగాణకు దక్కనున్న ప్రాతినిధ్యం
ఒడిశా, బెంగాల్‌ నేతలకూ చోటు
నేడు ఎన్డీయే ఎంపీల సమావేశం
30న మోదీ ప్రమాణ స్వీకారం!
దిల్లీ

తాజా ఎన్నికల్లో అఖండ విజయంతో ఉత్సాహంగా ఉన్న భాజపా రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ప్రధానమంత్రి, మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈనెల 30న ఉండవచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీని తమ నేతగా ఎన్నుకొనేందుకు భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ఎంపీలంతా శనివారం సమావేశం కానున్నారు. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని భాజపా తెలిపింది. అంతకుముందు భాజపా ఎంపీలు పార్లమెంటు భవనంలోనే ప్రత్యేకంగా సమావేశమవనున్నారు. ఎంపీల సమావేశంలో మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. మోదీయే తమ ప్రధాని అభ్యర్థిగా ఇప్పటికే ఎన్డీయే ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశం లాంఛనప్రాయమే. ఈసారి మంత్రివర్గంలో పలువురు కొత్త నేతలకు అవకాశం దక్కవచ్చనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. మోదీ సారథ్యంలోని నూతన మంత్రివర్గంలో భాజపా అధ్యక్షుడు అమిత్‌ షాకు అత్యంత కీలకమైన హోం, ఆర్థిక, విదేశాంగ, రక్షణ శాఖల్లో ఏదో ఓ మంత్రిత్వశాఖ బాధ్యతలు లభించే అవకాశం ఉందని పార్టీ నాయకులు పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతున్న సందర్భంగా మంత్రిపదవికి సంబంధించిన ప్రశ్నలకు అమిత్‌ షా నేరుగా సమాధానం చెప్పకుండా, అది ప్రధాని, పార్టీ నిర్ణయించాల్సిన విషయమంటూ పేర్కొన్న విషయం గమనార్హం. రక్షణ మంత్రిగా ఉన్న నిర్మలాసీతారామన్‌ కొత్త ప్రభుత్వంలో సైతం కీలక బాధ్యతల్లోనే కొనసాగవచ్చు. అమేఠీలో రాహుల్‌గాంధీపై ఘనవిజయాన్ని సాధించిన స్మృతి ఇరానీకి కూడా అత్యంత ప్రాధాన్యమున్న బాధ్యతలే లభించవచ్చు. ఇక, రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌గడ్కరీ, రవిశంకర్‌ ప్రసాద్‌, పీయుష్‌గోయెల్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌, ప్రకాశ్‌ జావడేకర్‌ తదితరులకూ కొత్త మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మిత్రపక్షాల్లో శివసేన, జేడీ(యు)లకూ కీలక స్థానం లభించనుంది. తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి విజయం సాధించిన కొత్త అభ్యర్థులకూ ఈసారి పార్టీ సముచిత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఈసారి మంత్రివర్గంలో యువతకూ భాగస్వామ్యం కల్పించాలని భాజపా నాయకత్వం యోచిస్తున్నట్లు సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.

ఈసారి జైట్లీ దూరం!
అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌లకు ఆరోగ్య సంబంధమైన సమస్యలున్న నేపథ్యంలో వారిద్దరికీ కొత్త మంత్రివర్గంలో చోటు లభించకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్య కారణాలతోనే జైట్లీ, సుష్మాలిద్దరూ ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయిన విషయం తెలిసిందే. మంత్రివర్గంలో చేరే విషయంలో జైట్లీ (66) ఆసక్తి చూపడం లేదని అభిజ్ఞ వర్గాలు వెల్లడించాయి. అనారోగ్యంతో బాధ పడుతున్న జైట్లీ తాజాగా ఎయిమ్స్‌లో చికిత్స పొంది గురువారమే ఇంటికి తిరిగి వచ్చినట్లు ఆయనను పరామర్శించి వచ్చిన ఎంపీలు తెలిపారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితి అంతగా బాగాలేదని అభిజ్ఞ వర్గాలు వెల్లడించాయి.గొంతుకు సంబంధించిన ఇబ్బంది తలెత్తడంతో మాట్లాడటం కూడా ఆయనకు కష్టమవుతోందని పేర్కొన్నాయి. ఈ కారణంగానే గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన సంబరాలకు హాజరు కాలేకపోయినట్లు తెలుస్తోంది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.