Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 175734
            [news_title_telugu_html] => 

ఎవరికీ అన్యాయం జరగలేదు 

[news_title_telugu] => ఎవరికీ అన్యాయం జరగలేదు  [news_title_english] => [news_short_description] => కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈ విద్యా సంవత్సరంలో చేపట్టిన ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలను హైకోర్టు సమర్థించింది. నిబంధనల ప్రకారమే వర్సిటీ.. వైద్యవిద్య [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
ఎవరికీ అన్యాయం జరగలేదు  - EENADU
close
ఎవరికీ అన్యాయం జరగలేదు 

వైద్యవిద్య ప్రవేశాలు సక్రమమే 
తేల్చిచెప్పిన హైకోర్టు 
కాళోజీ వర్సిటీ కాస్త తికమక పడిందని వ్యాఖ్య

ఈనాడు, హైదరాబాద్‌: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈ విద్యా సంవత్సరంలో చేపట్టిన ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలను హైకోర్టు సమర్థించింది. నిబంధనల ప్రకారమే వర్సిటీ.. వైద్యవిద్య ప్రవేశాలను చేపట్టిందని స్పష్టం చేసింది. 2017లో తీసుకొచ్చిన జీవో 114 ఆధారంగానే అడ్మిషన్లు జరిగాయంది. వర్సిటీ సమర్పించిన 27 ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల ప్రవేశాల వివరాలను పరిశీలిస్తే.. రెండో విడత కౌన్సెలింగ్‌లో ఏఒక్క రిజర్వుడ్‌అభ్యర్థికీ అన్యాయం జరగలేదని హైకోర్టు స్పష్టంచేసింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లాగే రెండో విడత నిర్వహించాలన్న పిటిషనర్ల వాదనను సమర్థించడానికి ఎలాంటి సహేతుక కారణమూ లేదంది. జీవో 114 నిబంధనల అమలులో వర్సిటీ విఫలమైందనడానికి ఆధారాలు లేవని, ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడంలేదని స్పష్టంచేస్తూ పిటిషన్లను కొట్టివేసింది.

జీవోల అమల్లో అయోమయంలో వర్సిటీ 
కౌన్సెలింగ్‌లో భాగంగా చట్టం అనుమతించిన విధానం అమలులో వర్సిటీకి కొంత తడబాటు ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2001లో జారీ చేసిన జీవో 550లో పేరా 5 ప్రకారం ఓపెన్‌ కేటగిరీలో సీటు పొందిన రిజర్వు అభ్యర్థి పక్కకు జరిగితే తరువాత మెరిట్‌ రిజర్వుడ్‌ అభ్యర్థితో భర్తీ చేయాలన్న నిబంధనను హైకోర్టు కొట్టివేయగా సుప్రీంకోర్టు సమర్థిస్తూ తరువాత మెరిట్‌ రిజర్వుడ్‌ అభ్యర్థితోనే భర్తీ చేయాలంది. ఇవే నిబంధనలతో కూడిన జీవో 114 గురించి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు, సుప్రీంకోర్టుల దృష్టికి తీసుకెళ్లని విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఏ జీవో 550 ఇంకా అమలులో ఉందన్న భావనతోనే వర్సిటీ ఉందని తప్పుబట్టింది.

మెరిట్‌ రిజర్వుడ్‌ సీట్ల భర్తీలో పొరపాటు లేదు 
420 మంది మెరిట్‌ రిజర్వుడ్‌ సీట్ల భర్తీలో కాళోజీ వర్సిటీ పొరపాటు చేయలేదని ధర్మాసనం పేర్కొంది. మొదటి విడతలో మాత్రమే జీవో అమలు చేయాల్సి ఉందని, తరువాత అవసరం లేదంది. ఆగస్టు 31లోగా సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తికావాల్సి ఉందన్న ఎంసీఐ నిబంధనల ప్రకారం ప్రవేశాలు చేపట్టడానికి అనుమతించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తొలగిస్తూ పిటిషన్లను కొట్టివేసింది.

నేటి నుంచి మూడో విడత వెబ్‌ఆప్షన్లు 
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కన్వీనర్‌ కోటాలో సీట్ల భర్తీ ప్రక్రియపై కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు దృష్టిపెట్టారు. ఇప్పటికీ మిగిలిన, ఇప్పటి వరకూ భర్తీ చేయని సీట్లను తక్షణమే నింపేందుకు వర్సిటీ ప్రవేశ ప్రకటనను విడుదల చేశారు. రెండోవిడత ప్రవేశాల్లో సీటు పొందిన అనంతరం కళాశాలల్లో చేరకపోవడం వల్ల మిగిలిన ఎంబీబీఎస్‌ సీట్లు 165, ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్లు 190, అఖిల భారత వైద్యవిద్య కోటాలో మిగిలిన సీట్లలో రాష్ట్రానికి కేటాయించిన 61, ఎన్‌సీసీ కోటాలో 27, సీఏపీ కోటాలో 27 సీట్ల చొప్పున మొత్తం 470 ఎంబీబీఎస్‌ సీట్లను భర్తీ చేయనున్నారు. మంగళవారం ఉదయం 8 నుంచి 22వ తేదీ ఉదయం 11 గంటల వరకూ అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. 22వ తేదీ రాత్రి సీట్ల కేటాయింపు ఫలితాలను వెల్లడిస్తారు. మూడోవిడత అనంతరం మిగిలిన సీట్లకు చివర్లో మాప్‌అప్‌ రౌండ్‌ను నిర్వహిస్తారు.

ఏపీలో నిబంధనతో.. 
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు 15 శాతం అన్‌రిజర్వుడ్‌ కేటగిరీలో సీట్లకు దరఖాస్తు చేసుకునే ముందు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలని కాళోజీ ఆరోగ్య వర్సిటీ ఉపకులపతి కరుణాకరరెడ్డి తెలిపారు. ఇప్పటికే తమ రాష్ట్రంలోని వైద్యకళాశాలల్లో చేరిన విద్యార్థులు.. ఈ నెల 17 తర్వాత ఇతర కళాశాలల్లో చేరాలనుకుంటే.. అందుకు అనుమతించబోమని ఏపీలోని ఎన్‌టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఆ గడువు ఇప్పటికే తీరిపోయి ఉండడంతో.. ఏపీలో సీట్లు పొందిన అభ్యర్థులు తిరిగి తెలంగాణలో అన్‌రిజర్వుడ్‌ కోటాలో దరఖాస్తు చేసుకోవడం వల్ల ఉపయోగం లేదని కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.