Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179638
            [news_title_telugu_html] => 

ప్లాస్టిక్‌పై పోరాటం!

[news_title_telugu] => ప్లాస్టిక్‌పై పోరాటం! [news_title_english] => [news_short_description] => దేశంలో అనేక రూపాల్లో వినియోగిస్తున్న ‘ప్లాస్టిక్‌’ కొండంత సమస్యగా తయారైంది. నానాటికీ తీవ్రతరమవుతున్న ఈ సమస్యను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ‘ప్లాస్టిక్‌పై పోరు’కు వచ్చే నెల 17న ఒక జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
ప్లాస్టిక్‌పై పోరాటం! - EENADU
close
ప్లాస్టిక్‌పై పోరాటం!

కేంద్రం కసరత్తు
ప్రత్యేక బృందం ఏర్పాటు

దేశంలో అనేక రూపాల్లో వినియోగిస్తున్న ‘ప్లాస్టిక్‌’ కొండంత సమస్యగా తయారైంది. నానాటికీ తీవ్రతరమవుతున్న ఈ సమస్యను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ‘ప్లాస్టిక్‌పై పోరు’కు వచ్చే నెల 17న ఒక జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందుకు సమగ్ర విధానాన్ని రూపొందించేందుకు రైల్వే, గ్రామీణాభివృద్ధి, జల్‌శక్తి, వాణిజ్య, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖలతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.

వ్యర్థాల నియంత్రణ

ప్లాస్టిక్‌ వ్యర్థాల్లో ఎక్కువశాతం పట్టణ ప్రాంతాల్లో నుంచే పోగవుతున్నాయి. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖతో సమన్వయం చేసుకుంటూ ‘ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2016’ను కేంద్ర పర్యావరణ శాఖ అమలు చేస్తోంది. ప్లాస్టిక్‌ సంచులు, ప్యాకింగ్‌ కోసం వాడే షీట్ల తయారీ, విక్రయం, పంపిణీ, వినియోగాన్ని నియంత్రించడం దీని ఉద్దేశం.

ఉద్యమ కార్యక్రమం

* ఒకసారి వాడిపారేసే స్టైరోఫోమ్‌ కప్‌లు, ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లు, స్పూన్లు, సంచులు, స్ట్రాల వంటివాటి నిర్మూలనకు పర్యావరణ శాఖ ప్రణాళికను ప్రారంభిస్తుంది. వీటిని వాడొద్దని ముందు వినియోగదారులను కోరుతారు. ఒక ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేశాక వినియోగానికి స్వస్తి పలకడాన్ని తప్పనిసరి చేస్తారు.
* ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ వస్తువుల నుంచి గ్రామాలకు విముక్తి కల్పించేలా తొలుత గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపడుతుంది.
* 31 లక్షల మంది గ్రామ పంచాయతీ సభ్యులు, స్వయం సహాయక బృందాలకు చెందిన 6 కోట్ల మంది గ్రామీణ మహిళల భాగస్వామ్యంతో ప్లాస్టిక్‌ వ్యర్థాలను ప్రయోజనకర పనులకు ఉపయోగిస్తారు.

ప్లాస్టిక్‌ రోడ్లు

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నది యోచన. మొత్తంగా గ్రామాల్లోని 25 శాతం రోడ్లు వీటితో నిర్మించాలన్నది లక్ష్యం. దీనివల్ల తారు వినియోగం తగ్గిపోతుంది. ఇంతవరకు దేశంలో 9 వేల కిలోమీటర్ల మేర ఇలాంటి రోడ్లను నిర్మించారు.

వేగం పెంచారు..

రైల్వేశాఖ: ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ పదార్థాలను ఈ ఏడాది అక్టోబర్‌ 2 నుంచి తమ ప్రాంగణాల్లో నిషేధించాలని నిర్ణయించింది. తొలిదశలో 360 ప్రధాన రైల్వే స్టేషన్లలో వాటర్‌ బాటిల్‌ క్రషింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేయనుంది. క్రమేపీ అన్ని స్టేషన్లలోనూ వీటిని ఏర్పాటు చేస్తుంది. రైల్వే స్టేషన్లలోని వ్యాపారులంతా ప్లాస్టిక్‌ సంచులు ఉపయోగించకుండా చూడాలని జోనల్‌ కార్యాలయాలను ఆదేశించింది.

వాణిజ్యశాఖ: ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని అమెజాన్‌ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్‌ కంపెనీలకు కేంద్ర వాణిజ్యశాఖ సూచించింది. ఈ దిశగా ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటికే చర్యలను ప్రారంభించింది.

- ఈనాడు, దిల్లీ

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.