
2017లో ఉత్తమ ప్రదర్శనకు అవార్డుల ప్రకటన
కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ అందజేత
ఈనాడు - దిల్లీ
పరిశ్రమల్లో సిబ్బంది భద్రత, ఆరోగ్యం తదితర అంశాలకు సంబంధించి ఉత్తమ సలహాలు, సూచనలు చేసిన వారికి కార్మికశాఖ ఏటా ఇచ్చే విశ్వకర్మ రాష్ట్రీయ పురస్కార్, నేషనల్ సేఫ్టీ అవార్డులు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ సంస్థలకు దక్కాయి. మంగళవారం దిల్లీలో కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 2017వ సంవత్సరం ఉత్తమ ప్రదర్శనకు పురస్కారాలను అందజేశారు. సమస్యలతో పోరాటం, సూచనలు.. సలహాలు, ఆర్థికంగా ఆదా చేయడంలో రెండు పురస్కారాలు.. ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంటుకు లభించాయి. జాతీయ స్థాయి, విశ్మకర్మ రాష్ట్రీయ పురస్కారం.. రూ. 50 వేల నగదును ఎస్.ఈశ్వరరావు, డి.త్రినాథరావు, బి.ధర్మారావు, ఎ.సత్తిబాబు, బి.అప్పలరాజులు కేంద్ర మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు.
పలు పథకాలకు సంబంధించి నేషనల్ సేఫ్టీ అవార్డులు అందుకున్న సంస్థలు
* జేకే ఫెన్నెర్(ఇండియా) లిమిటెడ్, పటాన్చెరు (రబ్బరు, ప్లాస్టిక్ తయారీ రెండు విభాగాల్లో తొలిస్థానం), తెలంగాణ
* భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రామచంద్రాపురం, హైదరాబాద్ (ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ద్వితీయ)
* ఎస్సార్ స్టీల్స్ ఇండియా లిమిటెడ్, విశాఖపట్నం (ఫ్రాబ్రికేటెడ్ మెటల్స్ తయారీలో తొలిస్థానం), మైహోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం (నాన్ మెటాలిక్ మినరల్స్ తయారీలో ప్రథమ, ద్వితీయ స్థానాలు)
* రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు, కడప (అదర్ మాన్యుఫాక్చరింగ్ యాక్టివిటీలో తొలిస్థానం)
* నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ విజయవాడ, ఆంధ్రప్రదేశ్ (అదర్ మాన్యుఫాక్చరింగ్ యాక్టివిటీలో రెండు విభాగాల్లో రెండు ద్వితీయ స్థానాలు)
* లౌరస్ ల్యాబ్స్ లిమిటెడ్ యూనిట్-1 విశాఖపట్నం (ఎరువులు రసాయనాల తయారీ తొలిస్థానం)
* ఎస్సార్ స్టీల్స్ ఇండియా లిమిటెడ్, విశాఖపట్నం (ఫ్యాబ్రికేటెడ్ మెటల్ తయారీ ద్వితీయ)
* ఆంధ్రా పెట్రో కెమికల్స్ లిమిటెడ్, విశాఖపట్నం (ఎరువులు రసాయనాల తయారీ తొలిస్థానం)
* లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ యూనిట్-3, విశాఖపట్నం (ఎరువులు రసాయనాల తయారీ ద్వితీయ)
* గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్, చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా (ఆహారోత్పత్తుల తయారీలో ద్వితీయ స్థానం)
* జేఎంసీ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్, గుంటూరు (నిర్మాణ రంగంలో మూడు విభాగాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు)
* బాలాజీ డెయిరీ, తిరుపతి (ఆహారోత్పత్తుల రెండు విభాగాల్లో తొలిస్థానం)లకు అవార్డులు దక్కాయి. ఆయా సంస్థల ప్రతినిధులు కేంద్ర మంత్రి చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- ఆ పాత్రకు అరవిందస్వామి అనుకున్నారట!
- ఎంజీ విద్యుత్తు కారు విశేషాలు ఇవే..
- ఇంటి వరకూ తోడుగా వస్తారు!
- మీ షేర్లు భద్రపర్చుకోండిలా..!
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ఎందుకా పైశాచికం?