close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చరవాణికి సందేశం.. సవరణకు అవకాశం

పక్కాగా పంటల సాగు వివరాలు

వ్యవసాయశాఖ అధికారుల కార్యాచరణ

న్యూస్‌టుడే, బొంరాస్‌పేట


పొలం దగ్గర సాగు వివరాలు నమోదు చేస్తున్న విస్తరణ అధికారిణి రేణుక

రైతుల అవస్థలను దూరం చేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు కొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. వానాకాలంలో సాగు చేస్తున్న పంటల వివరాలను మండల విస్తరణ అధికారులు నమోదు చేసుకుని రైతులకు చరవాణిలో సమాచారం ఇస్తున్నారు. తప్పుగా నమోదు జరిగినా విస్తరణ అధికారులతో సరి చేసుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నారు. గతేడాది నుంచి ఆన్‌లైన్‌లో పంట వివరాలు నమోదయితేనే మద్దతు ధరలకు కొనుగోలు చేస్తున్నారు. పంటల వారీగా సరైన సాగు వివరాలు అందుబాటులో లేనందున కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రాయితీ విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నా, రుణ లక్ష్యాన్ని నిర్దేశించాలన్నా సాగు వివరాలు సమగ్రంగా ఉంటేనే సాధ్యమవుతుందని వ్యవసాయ అధికారులు గుర్తించి ఈ విధానాన్ని ప్రారంభించారు.

జిల్లాలోని 18 మండలాల్లో 3,93,555 ఎకరాల్లో పంటలు సాగు చేశారని అధికారులు పేర్కొంటున్నారు. అత్యధికంగా పత్తి 2,13,192 ఎకరాలు, కంది 2,75,900, పెసర 20,800, జొన్న 15వేలుతో పాటుగా వరి, చెరుకు, మొక్కజొన్న తదితర పంటల వివరాలు ఎకరాల్లో నమోదు చేశారు. ఇంతకాలం తహసీల్‌ కార్యాలయంలో పని చేసే గ్రామరెవెన్యూ అధికారులే పంటల సాగు వివరాలు సేకరించగా ఈ వానాకాలం పంటల సాగు నుంచి వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేయటానికి రంగంలోకి దిగారు. క్లష్టర్‌ స్థాయిలోని వ్యవసాయ విస్తరణ అధికారులు నెల రోజుల కిందట పొలాలకు వెళ్లి సాగు వివరాలు తెలుసుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వారం రోజులుగా ఆ వివరాలను రైతుల చరవాణులకు సందేశాలుగా పంపిస్తూ తప్పుగా నమోదు ఉంటే సరి చేసుకునే వెసులుబాటు కల్పించారు. వివరాల్లో తేడాలుంటే క్లష్టర్‌ వ్యవసాయ విస్తరణ అధికారులతో సరి చేసుకునే అవకాశం ఉంది. ఇలా పక్కాగా సమాచారం అందుబాటులోకి రావటంతో చేతి కొచ్చిన పంటలను విక్రయించుకునే సమయంలో రైతులకు ఇబ్బందులు ఉండకపోగా దళారుల వ్యవస్థకు అడ్డుకట్ట వేయవచ్చని బావిస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలో ప్రతి ఏటా ఒకే రకమైన పంటలను సాగు చేయటంతో భూసారం తగ్గిపోతుందని గుర్తించిన అధికారులు రైతులకు నియంత్రిత సాగుపై అవగాహన కల్పించారు.

రైతులకు ప్రయోజనం

రాజేష్‌కుమార్‌, మండల వ్యవసాయాధికారి, బొంరాస్‌పేట

పంటలు సాగు చేసుకునే రైతులకు ఆన్‌లైన్‌ నమోదుతో ప్రయోజనం కలుగుతుంది. పొలంలో సాగు చేస్తున్న పంటకు, అధికారుల నమోదుకు తేడాలుంటే క్టష్టర్‌స్థాయి అధికారుల దగ్గరకెళ్లి సరి చేసుకోవాలి. లేకుంటే అమ్ముకునే సమయంలో అవస్థలు పడుతుంటారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో నమోదైన పంటలనే రైతుల దగ్గర మద్దతు ధరలకు కొంటారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.