
ప్రధానాంశాలు
ప్రధాని సభలో మమత ఆగ్రహం
పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్, భారతీయ జనతా పార్టీ మధ్య జరుగుతున్న రాజకీయ ఘర్షణ ఛాయలు నేతాజీ జయంతి వేడుకల్లోనూ కనిపించాయి. విక్టోరియా మెమోరియల్ దగ్గర ప్రధానితో కలసి పాల్గొన్న సభలో మమతా బెనర్జీ ప్రసంగించడానికి నిరాకరించారు. మమతను మాట్లాడేందుకు ఆహ్వానించినపుడు జనంలోని కొందరు జైశ్రీరామ్ నినాదాలు చేశారు. దీంతో దీదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వ కార్యక్రమానికి ఓ గౌరవం ఉంటుంది. ఇది రాజకీయ సభ కాదు. ప్రజా కార్యక్రమం. కోల్‌కతాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినందుకు ప్రధానమంత్రికి, కేంద్ర సాంస్కృతిక శాఖకు ధన్యవాదాలు. అయితే ఆహ్వానించి అవమానించడం సబబు కాదు, నేను మాట్లాడను. జై బంగ్లా, జైహింద్ ’’ అంటూ పూర్తి ప్రసంగం చేయకుండానే ముగించారు. ఈ సంఘటన రాష్ట్రానికే అవమానకరమని సీపీఐ(ఎం) వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ కూడా మమతా బెనర్జీకి మద్దతు పలికింది.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- ఈమె పాక్ ‘ఐష్’!
- యూట్యూబ్ ఫేమ్ షణ్ముఖ్‌పై కేసు నమోదు
- నా మాజీ ప్రియుడు ఇంకా అక్కడే ఉండిపోయాడు
- శ్రద్ధా జిగేల్.. సుమ ఆట.. క్రిష్ ఫిదా..!
- అమెరికా అప్పెంతో తెలుసా?
- ఐసీసీ ఆగ్రహానికి గురికాకుండా పిచ్‌లో మార్పులు!
- 25కి.మీ. రోడ్డు.. 18 గంటల్లో పూర్తి..!
- గూగుల్‌లో వీటిని వెతకడం ప్రమాదం!
- రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
- యువీ ట్వీట్లో తప్పేం లేదు: యాష్