close

ప్రధానాంశాలు

ఉచిత బియ్యం పంపిణీకి విరామం

ఉదయం ప్రారంభించి  సాయంత్రానికల్లా నిలిపివేత
వేలిముద్రల వల్ల వైరస్‌ వ్యాప్తి చెందుతున్న అనుమానాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యం పంపిణీ గురువారం లాంఛనంగా ప్రారంభమై, సాయంత్రానికల్లా నిలిచిపోయింది. చౌకధరల దుకాణాల్లో ఒకే యంత్రంలో అందరూ వేలిముద్రలు వేయటం వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న భయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. తర్జనభర్జనల అనంతరం బియ్యం పంపిణీని నిలిపివేయాలని సాయంత్రానికల్లా నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ ఈ మేరకు చౌకధరల దుకాణదారులందరికీ వర్తమానం పంపింది. మరోవైపు నగదు బదిలీపైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే నెల మొదటివారంలోగా ఈ రెండు పథకాలపైన ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

ప్రత్యామ్నాయాలు ఏమిటి?
గురువారం ఉదయం రాష్ట్రంలోని అన్ని చౌకధరల దుకాణాల్లో బియ్యం పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంపిణీ సాయంత్రానికల్లా నిలిచిపోవటంతో ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వేలిముద్రలతో ప్రమేయం లేకుండా బియ్యం సరఫరా చేస్తే అక్రమాలు జరిగే అవకాశం ఉందని  భావిస్తోంది. కరీంనగర్‌ తరహాలో ఇంటింటికీ సరఫరా చేసే అంశాన్నీ అధికారులు పరిశీలిస్తున్నారు.

నగదు బదిలీకి ఆర్థిక శాఖ కసరత్తు
నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 1,500 ఆర్థిక సహాయం బ్యాంకుల్లో వేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.