close

ప్రధానాంశాలు

నిత్యావసర వస్తు చట్టం ఉల్లంఘిస్తే ఏడేళ్ల జైలు

రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేఖ

ఈనాడు, దిల్లీ: నిత్యావసర వస్తు చట్టం 1955 నిబంధనలను ప్రయోగించి ప్రజలకు అన్ని రకాల నిత్యావసర సరకులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం లేఖలు రాశారు. నిల్వలపై పరిమితులు విధించడం, ధరలను నిర్ధారించడం, ఉత్పత్తి పెంచడం, డీలర్ల ఖాతాలు తనిఖీ చేయడం తదితర అధికారాలు ఈ చట్టం కింద ఉన్నాయని, వీటిని ఉల్లంఘించిన వ్యాపారులకు ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించొచ్చని గుర్తు చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిల్వలను దాచిపెట్టి బ్లాక్‌మార్కెటింగ్‌ విధానాల ద్వారా నిత్యావసరాల ధరలు పెంచే అవకాశం లేకపోలేదన్నారు. ఈ నేపథ్యంలో జూన్‌ 30 వరకు కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండానే రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో నిత్యావసర వస్తు చట్టాన్ని నోటిఫై చేయడానికి అనుమతిస్తున్నట్లు హోంశాఖ కార్యదర్శి పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.