close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమెరికాతో పోటీగా.. రోజువారీ కేసులు

 భారత్‌లో 24 గంటల్లో 52వేలకుపైగా.. అగ్రరాజ్యంలో 53,757 మందికి కరోనా

ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతికి అడ్డుకట్ట పడడం లేదు. అమెరికాతో పోటీగా రోజువారీ కేసుల్లో భారత్‌ పోటీ పడుతోంది. తాజాగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో 52,050 మందికి కొవిడ్‌-19 సోకింది. అదే వ్యవధిలో అమెరికాలో కొత్తగా 53,757 కేసులు నమోదయ్యాయి. భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 18,55,745కు చేరింది. కేసుల రోజువారీ వృద్ధిరేటు తొలిసారి 3%లోపునకు పడిపోయింది. కిందటి రోజుతో పోలిస్తే 2.88% మేర మాత్రమే కేసులు పెరిగాయి. ఇప్పటివరకు ఇదే అతి తక్కువ వృద్ధిరేటు. గత 24 గంటల్లో 803 మంది చనిపోయారు. మరణాలు 800 మార్క్‌ దాటడం వారం రోజుల్లో ఇది రెండోసారి. గత 24 గంటల్లో 44,306 మంది కోలుకున్నారు. ఒకేసారి 40వేల మందికి పైగా కోలుకోవడం వరుసగా ఇది మూడోరోజు. దీంతో కోలుకున్న వారి శాతం 66.30%కి, మరణాల రేటు 2.09%కి చేరింది. మహారాష్ట్ర, తమిళనాడుల్లో కొత్త కేసుల సరళి ఒకే రకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకల్లో కొంతమేర తగ్గింది. దిల్లీలో మే 27తర్వాత అతితక్కువ కేసులు (805) నమోదయ్యాయి. వరుసగా వెయ్యి లోపు కేసులు నమోదుకావడం గత వారంలో ఇది రెండోరోజు. ఇక్కడ వృద్ధిరేటు 1%లోపునకు పడిపోవడం వల్ల డబ్లింగ్‌ సమయం 180రోజులకు పెరిగింది. గత 24 గంటల్లో మొత్తం 25 రాష్ట్రాల్లో మరణాలు సంభవించాయి. ఇందులో తొలి పది రాష్ట్రాల్లోనే 87.17% చోటుచేసుకున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 266, తమిళనాడులో 108 మరణాలు సంభవించాయి. పశ్చిమబెంగాల్‌లో తొలిసారి 50కిపైగా మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత వారం సగటు వృద్ధిరేటు 3.23కి పడిపోవడంవల్ల కేసుల రెట్టింపునకు పట్టే సమయం 22 రోజులకు పెరిగింది.  ప్రస్తుతం దేశంలో పది లక్షలమందికి 28.43 మరణాలు సంభవిస్తున్నాయి. అందులో ఏపీతో సహా 9 రాష్ట్రాల్లో జాతీయ సగటుకంటే ఎక్కువ మరణాల్లో చోటుచేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పది లక్షలమందికి 28.51 మంది చనిపోతున్నారు. జమ్మూకశ్మీర్‌లో 29.91, గోవాలో 35.3, కర్ణాటకలో 38.5, గుజరాత్‌లో 39.27, పుదుచ్చేరిలో 39.62, తమిళనాడులో 54.48, మహారాష్ట్రలో 128.64, దిల్లీలో 214.9 మంది చనిపోయారు. తెలంగాణలో ప్రతి పది లక్షలకు 14 మరణాలు సంభవించాయి. ఐసీఎంఆర్‌ పరీక్షలు ఇదివరకు ఎన్నడూలేనంతగా ఒకేరోజు 6.61 లక్షలకు చేరాయి. జులై 31న నిర్వహించిన 6.42 లక్షల కంటే ఇదే అత్యధికం.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.