Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 100991
            [news_title_telugu_html] => 

ఆ స్మార్ట్‌ఫోన్‌కు ఆండ్రాయిడ్‌ ఇచ్చేది లేదు!

[news_title_telugu] => ఆ స్మార్ట్‌ఫోన్‌కు ఆండ్రాయిడ్‌ ఇచ్చేది లేదు! [news_title_english] => Google Suspend Some Business With Huawei After Trump Blacklist [news_short_description] => ప్రముఖ టెలికాం కంపెనీ హువావేతో గూగుల్‌కు చెందిన మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ తెగదెంపులు చేసుకుంది. హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లతో సహా ఇతర ఏ సాంకేతిక సహకారం హువావేకు [news_tags_keywords] => google,Huawei , Android [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-21 00:40:47 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆ స్మార్ట్‌ఫోన్‌కు ఆండ్రాయిడ్‌ ఇచ్చేది లేదు! - Google Suspend Some Business With Huawei After Trump Blacklist - EENADU
close

తాజా వార్తలు

ఆ స్మార్ట్‌ఫోన్‌కు ఆండ్రాయిడ్‌ ఇచ్చేది లేదు!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెలికాం కంపెనీ హువావేతో గూగుల్‌కు చెందిన మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ తెగదెంపులు చేసుకుంది. హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లతో సహా ఇతర ఏ సాంకేతిక సహకారం హువావేకు అందించబోమని ప్రకటించింది. ట్రంప్‌ ప్రభుత్వం హువావేను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టిన నేపథ్యంలో గూగుల్‌ ఈ చర్యకు ఉపక్రమించింది. 

ప్రస్తుతం హువావే మొబైల్స్‌ వినియోగిస్తున్న వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా గూగుల్‌ యాప్స్‌ను వినియోగించుకోవచ్చు. ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాప్‌లకు సంబంధించి కొత్త అప్‌డేట్స్‌ను కూడా గూగుల్‌ హువావే వినియోగదారులు యథావిధిగా అందిస్తుంది. ‘సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తాం. అమలు పరచాల్సిన విధివిధానాలపై సమీక్షిస్తాం. ప్రస్తుతం హువావే మొబైల్స్‌ వినియోగిస్తున్న వారికి మా సేవలు, గూగుల్‌ ప్లే‌, భద్రత మొదలైనవన్నీ కొనసాగుతాయి’ అని గూగుల్‌ ప్రతినిధి తెలిపారు. 

గూగుల్‌ తాజా నిర్ణయంతోతో హువేవా స్మార్ట్‌ఫోన్‌ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపనుంది. భవిష్యత్‌లో తయారు చేసే స్మార్ట్‌ఫోన్‌లలో ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను హువావే వినియోగించుకోలేదు. దీని కారణంగా చైనా వెలుపల విక్రయాలు జరపాలంటే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే గూగుల్‌ అందించే సేవలైన గూగుల్‌ ప్లే, స్టోర్‌, జీమెయిల్‌, యూట్యూబ్‌ వంటి అప్లికేషన్లు హువేవా ఫోన్లలో ఉండవు. ‘హువావే కేవలం ఆండ్రాయిడ్‌కు సంబంధించిన పబ్లిక్‌ వెర్షన్‌ను మాత్రమే వినియోగించుకోగలదు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన యాప్స్‌ను, సేవలను గూగుల్‌ నుంచి పొందలేదు’ అని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మొబైల్‌ కంపెనీలు గూగుల్‌ అందించే ఆండ్రాయిడ్‌ ఫ్లాట్‌ఫాంపైనే మొబైల్స్‌ తయారు చేస్తున్నాయి. చైనాకు చెందిన కొన్ని మొబైల్‌ సంస్థలకు సొంత ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉన్నా, ఆండ్రాయిడ్‌తో వెర్షన్స్‌తో కలిపి వాటిని మొబైల్‌ ఫోన్లలో తీసుకొస్తున్నాయి. వీటినే కస్టమైజ్డ్‌ ఓఎస్‌లు అంటారు. షామీ అందించే ఎంఐయూఐ, ఒప్పో కలర్‌, ఆసుస్‌ జెన్‌ యూఐ, వీవో ఫన్‌టచ్‌, వన్‌ప్లస్‌ ఆక్సిజన్‌ ఓఎస్‌లు ఈ కోవలోకే వస్తాయి. హువావే కూడా ఈఎంయూఐ ఆధారిత ఆండ్రాయిడ్‌తోనే మొబైల్స్‌ను తయారు చేస్తోంది. గూగుల్‌ తాజా నిర్ణయంతో హువావే అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి.

గత గురువారం హువావే కంపెనీపై ట్రంప్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.  ప్రభుత్వ అనుమతి లేకుండా  అమెరికా సంస్థల నుంచి హువావే ఎటువంటి సాంకేతికతను కొనుగోలు చేయకూడదు. కాగా, టి-మొబైల్స్‌కు చెందిన ‘తాపీ’ రోబో హ్యాండ్‌ డిజైన్‌ను హువావే తస్కరించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

గూగుల్‌ చర్యపై స్పందించిన హువావే 
ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ఇచ్చేది లేదని గూగుల్‌ ప్రకటించిన నేపథ్యంలో హువావే స్పందించింది. తాము తయారు చేసే కొత్త ఫోన్లలో ఆండ్రాయిడ్‌ వినియోగించమని హువావే తెలిపింది. ‘ఆండ్రాయిడ్‌ కీలక భాగస్వామిగా ప్రపంచవ్యాప్తంగా ఆ సిస్టమ్‌ను అభివృద్ధి చేసి, వ్యాప్తి చేయడంలో హువావే పాత్ర కూడా ఉంది. ఇటు వినియోగదారులు, అటు మొబైల్‌ ఇండస్ట్రీలు వినియోగించుకునేలా కొత్త ఫ్లాట్‌పాంను అభివృద్ధి చేస్తాం. హువావే, హానర్‌ కొత్త ఫోన్లకు అన్ని రకాల అప్‌డేట్స్‌, భద్రతలను కల్పిస్తాం. ఇది వినియోగదారులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది’’ అని హువావే తెలిపింది


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.