close

తాజా వార్తలు

నీటి కొరత.. కంపెనీల్లో బాత్‌రూములూ మూత!!

చెన్నైలో రోజురోజుకూ తీవ్రమవుతున్న నీటి సమస్య

చెన్నై: చెన్నైలో నీటి కష్టాలు రోజురోజుకూ తారస్థాయి కి చేరుతున్నాయి. నీటి కటకటను ఎదుర్కొనేందుకు అటు ప్రభుత్వం, ఇటు ఐటీ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాయి. పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసుకోవాలని సూచిస్తున్నాయి. మరికొన్ని  ఐటీ సంస్థలు నీటి కొరతను అధిగమించేందుకు బాత్‌రూములను సైతం మూసివేస్తుండడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది!! 

తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా గత కొద్దిరోజులుగా తాగునీటికి కటకట ఏర్పడింది. ముఖ్యంగా రాజధాని చెన్నైలో సమస్య తీవ్రంగా ఉంది. నగర శివారులోని మహాబలిపురం రోడ్డులోని ఉన్న ఐటీ కారిడార్‌, సిరుసేరి ఐటీ పార్కులో కొలువుదీరి ఉన్న పలు కంపెనీలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉద్యోగుల అవసరాల కోసం కంపెనీలు నీటి ట్యాంకర్లపై ఆధారపడుతున్నాయి. దీంతో ఆయా కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసుకోవాని సూచిస్తున్నాయి. రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన వారిని మాత్రమే కార్యాలయాలకు రావాలని సూచిస్తున్నాయని ఓ ఐటీ సంస్థకు చెందిన ఉద్యోగి ఒకరు చెప్పారు. మరో ఉద్యోగి అయితే నీటి కష్టాన్ని కళ్లకు కట్టారు. తమ కార్యాలయంలో 10 బాత్‌రూములు ఉంటే రెండు మాత్రమే ఉద్యోగుల అవసరాల కోసం అందుబాటులో ఉంచుతున్నారని చెప్పుకొచ్చారు. 

ఐటీ సంస్థల్లో నీటి కష్టాలపై పురపాలక శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి మాట్లాడుతూ ఐటీ సంస్థల్లో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ సంస్కృతి ఎప్పటి నుంచో ఉందని సమాధానమిచ్చారు. ఐటీ సంస్థలకు నీటి కొరతను తీర్చేందుకు తగిన నీటి ట్యాంకర్లను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడిచారు. నీటి ఎద్దడి కారణంగా హోటళ్లు మూతపడ్డాయని వస్తున్న వార్తలనూ ఆయన ఖండించారు. చిన్న, మధ్యతరహా హోటళ్లు ప్లేట్లకు బదులు అరటి ఆకులను వినియోగించాలని సూచించారు.

ఎందుకీ పరిస్థితి?
చెన్నైకి నీటిని అందించే పూండి, పుళల్‌, చోళవరం, చెంబరంబాక్కం, రెడ్‌హిల్స్‌, వీరాణం తదితర జలాశయాలు దాదాపు అడుగంటాయి. వానలు కురవకపోవడం, భూగర్భజలాలు పడిపోవడం, తెలుగు గంగ పథకం కింద చెన్నైకి రావాల్సిన కండలేరు జలాలు కూడా సరఫరా కాకపోవడం లాంటి కారణాలతో నీటి ఎద్దడి తారస్థాయికి చేరింది. 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.