close

తాజా వార్తలు

వేరుపడిన భర్తతో బిడ్డను కనాలని!

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మహిళ

దిల్లీ: విడాకులకు దరఖాస్తు చేసుకుని, వేరుగా ఉంటున్న తన భర్తతో రెండో బిడ్డను కనే అవకాశం కల్పించాల్సిందిగా మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన భర్తతో సంసార జీవనం ద్వారా లేదా కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్‌) ద్వారానైనా బిడ్డను కనేందుకు వీలు కల్పించాల్సిందిగా ఆమె ఓ ఫ్యామిలీ కోర్టులో గత ఏడాది పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమెకు బిడ్డను కనే హక్కు ఉన్నప్పటికీ చట్టానికి కొన్ని పరిమితులున్నట్లు ఈ కేసులో తాజాగా న్యాయస్థానం పేర్కొంది. కృత్రిమ గర్భధారణ చట్టబద్ధమైన ఓ అవకాశంగా పేర్కొంటూ ఈ విధానం (ఏఆర్‌టీ) పాటించవచ్చని.. అయితే ఇందుకు ఆమె భర్త అనుమతి కీలకమని పేర్కొంది. ఈమేరకు ఈనెల 24న వారిద్దరూ ఓ మ్యారేజి కౌన్సిలర్‌ను, అనంతరం నెల రోజుల్లో ఐవీఎఫ్‌ నిపుణులను కలవాలని సూచించింది. అయితే ఆమె విజ్ఞాపన చట్టవిరుద్ధమని, సామాజిక కట్టుబాట్లకు వ్యతిరేకమంటూ ఆమె భర్త దీన్ని వ్యతిరేకించారు. ముంబయికి చెందిన ఈ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు. వారికి ఓ బిడ్డ పుట్టిన తర్వాత ఆమె తనను బాధలు పెడుతోందంటూ 2017లో అతను విడాకులకు అభ్యర్థించారు. అనంతరం తమ వైవాహిక జీవితం పునరుద్ధరణకు ఆమె నాందేడ్‌లోని ఓ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్లు విచారణలో ఉండగా 2018లో ఆమె అతనితో మరో బిడ్డ కావాలంటూ న్యాయస్థానంలో విజ్ఞాపన దాఖలు చేశారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.