Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000523
            [news_title_telugu_html] => 

నేలరాలిన భాజపా ‘అరుణ్‌’తార..!

[news_title_telugu] => నేలరాలిన భాజపా ‘అరుణ్‌’తార..! [news_title_english] => Arun Jaitley passed away [news_short_description] => అమృత్‌సర్‌ నుంచి అరుణ్‌ జైట్లీ పోటీ చేస్తున్నారనే విషయం తెలియగానే ఆ నియోజకవర్గంలో దాదాపు 40 భాజపా కార్యాలయాలు స్వచ్ఛందంగా తెరుచుకొన్నాయి.. [news_tags_keywords] => arun jaitley,bjp,nda,modi [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 00:19:08 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నేలరాలిన భాజపా ‘అరుణ్‌’తార..! - Arun Jaitley passed away - EENADU
close

తాజా వార్తలు

నేలరాలిన భాజపా ‘అరుణ్‌’తార..!

అమృత్‌సర్‌ నుంచి అరుణ్‌ జైట్లీ పోటీ చేస్తున్నారనే విషయం తెలియగానే ఆ నియోజకవర్గంలో దాదాపు 40 భాజపా కార్యాలయాలు స్వచ్ఛందంగా తెరుచుకున్నాయి. అవన్నీ ఆయన బంధువులు, మిత్రులు నివసించే ఇళ్లే. వారంతా జైట్లీ గెలుపు తమ సొంత పని అయినట్లు అహోరాత్రులు కష్టపడ్డారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశం ఉంది.. జైట్లీ కోసం ప్రచారానికి వచ్చిన డాక్టర్లు, ఇంజినీర్లలో అత్యధికులు ఆయన మీద ప్రేమతో వచ్చినవారే. వారంతా ఆయన చలువతోనే విద్యాభ్యాసం పూర్తి చేసి మంచి జీవితంలో స్థిరపడ్డారు. అరుణ్‌ జైట్లీలో పైకి కనిపించే గాంభీర్యం మాటున ఒక మంచి మనసు దాగి ఉంది. మనసున్న మారాజుగా జైట్లీని సన్నిహితులు అభివర్ణిస్తుంటారు. 


తన ఇల్లే సిబ్బంది పిల్లల పెళ్లిళ్లకు వేదిక..!
దిల్లీలోని అత్యంత ప్రముఖ న్యాయవాదుల్లో జైట్లీ కూడా ఒకరు. పన్ను చట్టాలు, ఆర్థిక వ్యవహారాలు ఆయనకు కొట్టిన పిండి. కోర్టులో ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవారని పేరు. కానీ, తన గుమాస్తాల విషయంలో మాత్రం జైట్లీ ఎంతో ఉదారంగా ఉండేవారు. ప్రతి కేసులోను ప్లీడర్‌ గుమాస్తాలకు ఇచ్చే ఖర్చులను నేరుగా వారికే ఇప్పించేవారు. దీంతో పాటు వారి సిబ్బంది పిల్లల చదువులకు అవసరమైనప్పుడల్లా ఆర్థిక సాయం చేసేవారు. సిబ్బంది పిల్లల పెళ్లిళ్లకు దిల్లీలోని ఇంటిని వేదికగా చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ అభిమానంతోనే జైట్లీ అమృత్‌సర్‌ బరిలోకి దిగగానే వారంతా తమ సొంతపనైనట్లు రెక్కలు కట్టుకొని అక్కడ వాలారు. 

లాహోర్‌ నుంచి అమృత్‌సర్‌కు..
అరుణ్‌ జైట్లీ 1952లో మహారాజ్‌ కిషన్‌ జైట్లీ, రతన్‌ ప్రభు దంపతులకు దిల్లీలో జన్మించారు. తండ్రి కిషన్‌ స్వస్థలం ప్రస్తుత పాకిస్థాన్‌లోని లాహోర్‌. ఆయన అక్కడ పేరు ప్రఖ్యాతులు కలిగిన న్యాయవాది‌. తల్లి రతన్‌ ప్రభుది పంజాబ్‌లోని అమృత్‌సర్‌. దేశవిభజన సమయంలో కిషన్‌ జైట్లీ దిల్లీకి నారాయణ్‌ విహార్‌కు వచ్చి ప్రాక్టీస్‌ ప్రారంభించారు. అక్కడే అరుణ్‌జైట్లీ జన్మించారు.  జైట్లీ విద్యాభ్యాసం మొత్తం మంచి పేరున్న విద్యాలయాల్లోనే జరిగింది. సెయింట్‌ జేవియర్‌ స్కూల్‌, శ్రీరామ్‌ కామర్స్‌ కాలేజ్‌, లా విద్యాభ్యాసం దిల్లీ యూనివర్సిటీల్లో చదివారు.

ఇందిరా గాంధీపై పోరాటం..
జైట్లీ తొలి అరెస్టు ఎమర్జెన్సీ సమయంలో జరిగింది. ఆయన లా విద్యను అభ్యసిస్తున్న సమయంలో అప్పటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించారు. దీంతో విద్యార్థి నాయకుడైన జైట్లీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించారు. ఫలితంగా ఆయన్ను మీసా చట్టం కింద అరెస్టు చేసి జైల్లో వేశారు.  19నెలలు జైల్లోనే గడిపారు. దీంతో ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోయారు. దిల్లీలోని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ భవనాన్ని ఇందిరాగాంధీ ప్రభుత్వం కూల్చివేయాలని నిర్ణయించడంతో దానికి వ్యతిరేకంగా జైట్లీ పోరాడారు. అప్పుడే ఆయనకు న్యాయ కోవిదులు ఫాలీనారిమన్‌, ఎస్‌.గురుమూర్తి, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అధిపతి రామ్‌నాథ్‌ గోయంకాలతో  పరిచయం ఏర్పడింది.  1987లో దిల్లీలో న్యాయవాదిగా ప్రాక్టిస్‌ ప్రారంభించిన జైట్లీని ఆ తర్వాత రెండేళ్లకే వీపీ సింగ్‌ ప్రభుత్వం అదనపు సోలిసిటర్‌ జనరల్‌గా 1989లో నియమించింది.  బోఫోర్స్‌ కేసుకు సంబంధించిన పేపర్‌ వర్క్‌ మొత్తం జైట్లీనే చేశారు. 

హైప్రొఫైల్‌ లాయర్‌గా..
దిల్లీ న్యాయవాద సర్కిళ్లలో జైట్లీ హైప్రొఫైల్‌ లాయర్‌గా మంచి గుర్తింపు ఉంది. మాధవ్‌రావ్‌ సింధియా, శరద్‌ యాదవ్‌, ఎల్‌ కే అడ్వాణీ వంటి వారి తరపు ఆయన కోర్టులో వాదించారు. 1998లో మాదక ద్రవ్యాలు, మనీ లాండరింగ్‌పై ఐరాసలో చర్చించేందుకు భారత తరపున ఆయన ప్రాతినిధ్యం వహించారు. కోకాకోలాకు వ్యతిరేకంగా పెప్సీకో దాఖలు చేసిన కేసును అరుణ్‌ జైట్లీనే వాదించారు. ఆయన రాజ్యసభలో భాజపాకు నాయకత్వం వహించేవరకు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ను కొనసాగించారు. 

వాజ్‌పేయి కేబినెట్‌లో మంత్రిగా..
1999లో వాజ్‌పేయి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు తొలిసారి మంత్రిగా ఆయన పెట్టుబడుల ఉపసంహరణ శాఖను చేపట్టారు. ఆ శాఖను ప్రారంభించడం అదే తొలిసారి. న్యాయకోవిదుడైన రాంజెఠ్మలనీ ఆ శాఖకు రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలు కూడా జైట్లీనే స్వీకరించారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం రూపకల్పనలో జైట్లీనే కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత పార్టీ బాధ్యతల కోసం కేబినెట్‌ నుంచి వైదొలగినా.. 2003లో మళ్లీ కామర్స్‌ అండ్‌ లా మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2009లో అడ్వాణీ ఆయన్ను రాజ్యసభలో పార్టీ నాయకుడిగా నియమించారు. 

మోదీకి బలమైన మద్దతుదారు..
అరుణ్‌ జైట్లీ నేటి ప్రధాని నరేంద్ర మోదీకి బలమైన మద్దతుదారుగా నిలిచారు. ప్రధాని అభ్యర్థిత్వంపై పార్టీ సీనియర్‌ నాయకులు పెదవి విరిచినా మోదీకి మద్దతు ఇచ్చారు. అంతేకాదు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఎంపిక కూడా జైట్లీ మద్దతుతోనే జరిగింది. అప్పట్లో ఉమాభారతి వ్యతిరేకించినా.. ఆయన చౌహాన్‌కే ఓటు వేశారు. ఆ తర్వాత చౌహాన్‌ మధ్యప్రదేశ్‌లో మూడుసార్లు భాజపాను నిలబెట్టారు. ఇక నోట్ల రద్దు, జీఎస్‌టీ, దివాలా చట్టానికి కోరలు తొడగడంలో జైట్లీ కీలక పాత్రను పోషించారు. 

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.