close

తాజా వార్తలు

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డుప్రమాదం

35 మంది మృతి

మదీనా: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మదీనా ప్రావిన్స్‌లోని అల్‌ అఖల్‌ సెంటర్‌ వద్ద యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు.. భారీ వాహనాన్ని(ప్రోక్లెయినర్‌) ఢీకొట్టింది. పవిత్ర క్షేత్రం మక్కా సమీపంలో బుధవారం రాత్రి 7గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది విదేశీయులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను అల్‌ హమ్నా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన బస్సులో ఏషియన్‌, అరబిక్‌ పౌరులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.

విచారం వ్యక్తం చేసిన మోదీ

మక్కాలో జరిగిన  ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.