
తాజా వార్తలు
మస్కట్: ఒమన్లోని మస్కట్లో భారతీయులుగా భావిస్తున్న ఆరుగురు కార్మికులు మరణించినట్లు భారత ఎంబసీ వెల్లడించింది. సీబ్ ప్రాంతంలో నీటి పారుదల ప్రాజెక్టులో పనిచేస్తున్న వీరు ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా భూగర్భంలో మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు భారత ఎంబసీ అధికారులు ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘భారత కార్మికులుగా భావిస్తున్న ఆరుగురు వ్యక్తులు మృతి చెందడంపై తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాం. ఈ ఘటనలో బాధితులను గుర్తించే విషయమై ఒమన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వారి కుటుంబాలకు పూర్తి అండగా ఉంటాం’ అని పేర్కొంది. అదేవిధంగా కార్మికుల మృతికి సంబంధించి పక్కా సమాచారం లేదు.. కానీ మస్కట్ మీడియా వర్గాలు మాత్రం బాధితులు లోతైన భూగర్భంలో పనులు చేస్తున్నట్లు వెల్లడించింది.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- కొల్లగొట్టింది రూ.100కోట్లకు పైనే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
