close

తాజా వార్తలు

స్నాక్స్‌ ప్యాకెటే ఆ బాలుడికి శాపమైంది!

భోపాల్‌: తినుబండారాల ప్యాకెట్‌లో వచ్చే ఆట బొమ్మ ఓ బాలుడి పాలిట శాపమైంది. పొరపాటున గొంతులో ఇరుక్కుని ఆ చిన్నారి మృతిచెందాడు. ఈ హృదయవిదారక ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇక్కడి నీముచ్‌ జిల్లా కెంపూరియా గ్రామంలో ఓ బాలుడు స్నాక్స్‌ ప్యాకెట్‌ కొన్నాడు. అందులో స్నాక్స్‌తో పాటు అతడికి ఒక విజిల్‌ వచ్చింది. ఆ బాలుడు స్నాక్స్‌ తింటూ దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో విజిల్‌ బాలుడికి గొంతులో ఇరుక్కుపోయింది. ఆస్పత్రికి తీసుకువెళ్లినా వైద్యులు అతడి ప్రాణాలు కాపాడలేకపోయారు. అనంతరం బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు అధికారులు ఆ ఆహార పదార్థాల పరిశ్రమను సీజ్‌ చేశారు. 1800 ప్యాకెట్లను సీజ్‌ చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.