
ప్రధానాంశాలు
రూ.48,000 కోట్లతో దేశీయ యుద్ధ విమానాలకొనుగోలు
కేబినెట్ కమిటీ ఆమోద ముద్ర
దిల్లీ: దేశీయంగా అభివృద్ధిపరిచిన 83 తేలికపాటి తేజస్ యుద్ధ విమానాలను రూ.48,000 కోట్ల ఖర్చుతో సమీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత వాయుసేన (ఐఏఎఫ్) అవసరాల కోసం వీటి సేకరణపై భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘‘..దేశంలో రక్షణరంగ ఉత్పత్తుల తయారీ పరంగా స్వావలంబన సాధించడంలో ఇదొక మేలి మలుపుగా నిలిచిపోతుంది. దేశీయ రక్షణ ఉత్పత్తుల కొనుగోలు ఒప్పందాల్లో ఇది అతి పెద్దది. ఐఏఎఫ్‌ను బలోపేతం చేయడానికి ఇది దోహదం చేస్తుంది. రాబోయే ఏళ్లలో తేజస్ విమానాలు వాయుసేనకు వెన్నుదన్నుగా నిలుస్తాయి. ఈ విమానాల్లో అనేక రకాల నూతన సాంకేతికతలు ఉన్నాయి. వీటిలో చాలావరకు మనం ఇంతవరకు వాడనివే. ఈ విమానాలను తయారు చేసే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సంస్థ ఇప్పటికే నాసిక్, బెంగళూరు డివిజన్లలో తయారీ సదుపాయాలను నెలకొల్పింది. సకాలంలో ఉత్పత్తిని పూర్తిచేయడానికి వీలుగా మెరుగైన వసతులను సమకూర్చుకుంది. గగనతల సంబంధిత తయారీ పరంగా మన కాళ్లపై మనం నిలదొక్కుకునేలా తేజస్ కార్యక్రమం నిలిచిపోతుంది. సీసీఎస్‌లో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు’’ అని రాజ్‌నాథ్ చెప్పారు.
మార్చిలో ఒప్పందం.. 2024 నుంచి సరఫరా
తేజస్ విమానాల కోసం మూడేళ్ల క్రితమే భారత వాయుసేన టెండర్లు జారీ చేసింది. తొలివిడతలో హెచ్ఏఎల్ ఇవ్వనున్న 40 జెట్లలో కొన్ని ఇప్పటికే వాయుసేన సేవల్లో చేరాయి. విమాన స్థావరాల్లో వాటి నిర్వహణ, మరమ్మతులకు వీలు కల్పించి, తక్కువ సమయంలోనే అవి సేవలకు అందుబాటులోకి వచ్చేలా సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం అంగీకరించిందని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఏటా 8 విమానాలను తయారీ సామర్థ్యం ఉన్న హెచ్ఏఎల్ సంస్థ.. ఇప్పటికే దానిని రెట్టింపు చేసుకుంది. ఐఏఎఫ్-హెచ్ఏఎల్ మధ్య మార్చిలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని, 2024 నుంచి విమానాల అందజేత మొదలవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. విమానంలో వాడేవాటిలో దేశీయంగా తయారైనవి 50% ఉండగా, ప్రస్తుత కార్యక్రమం ముగిసే నాటికి అది 60 శాతానికి చేరుతుంది. దాదాపు 500 వరకు భారతీయ కంపెనీలు ఈ విమానాల తయారీలో హెచ్ఏఎల్తో పాలుపంచుకుంటున్నాయి.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- 2-1 కాదు 2-0!
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడితడే!
- ఇక చాలు
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- శంషాబాద్‌లో సిరాజ్‌కు ఘన స్వాగతం..