భారతీయ అమెరికన్లకు బైడెన్‌ పెద్దపీట

ప్రధానాంశాలు

భారతీయ అమెరికన్లకు బైడెన్‌ పెద్దపీట

20 మందికి కీలక పదవులు
అమెరికా అధ్యక్షుని ప్రసంగాల రచయితగా వినయ్‌రెడ్డి

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న బైడెన్‌ తన ప్రభుత్వంలో ఇండియన్‌- అమెరికన్లకు పెద్ద పీట వేశారు. మొత్తం 20 మందికి కీలక పదవులు ఇవ్వగా అందులో 13 మంది మహిళలు ఉండడం విశేషం. 17 మందికి శ్వేత సౌధంలోనే స్థానం కల్పించడం ఇంకో విశేషం. చిరకాలం నుంచి తనకు మద్దతుదారునిగా ఉన్న వినయ్‌ రెడ్డికీ చోటిచ్చారు.

ఎవరికి ఏ పదవి?
నీరా టాండన్‌: శ్వేత సౌధంలో పనిచేస్తారు. మేనేజ్‌మెంట్‌, బడ్జెట్‌ విభాగం డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.
వివేక్‌ మూర్తి: అమెరికా సర్జన్‌ జనరల్‌
వినయ్‌ రెడ్డి: డైరెక్టర్‌ స్పీచ్‌ రైటింగ్‌
వినీతా గుప్త: న్యాయ శాఖలో అసోసియేట్‌ అటార్నీ జనరల్‌
ఉజ్రా జెయా: విదేశాంగ శాఖలో అండర్‌ సెక్రటరీ. పౌర భద్రత, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల వ్యవహారాలు చూస్తారు.
మాలా అడిగా: ప్రథమ మహిళ డాక్టర్‌ జిల్‌ బైడెన్‌కు విధాన పర సలహాదారు (పాలసీ డైరెక్టర్‌)
గరిమా వర్మ: ప్రథమ మహిళకు డిజిటల్‌ డైరెక్టర్‌
సబ్రీనా సింగ్‌: శ్వేత సౌధం డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీ
అయేషా షా: శ్వేత సౌధంలోని డిజిటల్‌ వ్యూహం కార్యాలయంలో పార్టనర్‌షిప్‌ మేనేజర్‌
సమీరా ఫైజలి: శ్వేత సౌధంలోని జాతీయ ఆర్థిక మండలిలో డిప్యూటీ డైరెక్టర్‌
భరత్‌ రామమూర్తి: జాతీయ ఆర్థిక మండలి డిప్యూటీ డైరెక్టర్‌
గౌతం రాఘవన్‌: శ్వేత సౌధంలో అధ్యక్షుని వ్యక్తిగత సిబ్బంది వ్యవహారాల డైరెక్టర్‌
వేదాంత్‌ పటేల్‌: శ్వేత సౌధంలో అసిస్టెంట్‌ ప్రెస్‌ సెక్రటరీ
తరుణ్‌ ఛాబ్రా: జాతీయ భద్రత మండలిలో సాంకేతిక, జాతీయ భద్రత సీనియర్‌ డైరెక్టర్‌
సుమోనా గుహ: దక్షిణాసియా వ్యవహారాల సీనియర్‌ డైరెక్టర్‌
శాంతి కళాథిల్‌: జాతీయ భద్రత మండలిలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల వ్యవహారాల సమన్వయకర్త
విదుర్‌ శర్మ: కరోనా స్పందన బృందం సలహాదారు
నేహా గుప్త: శ్వేత సౌధంలో అసోసియేట్‌ కాన్సెల్‌
రీమా షా: డిప్యూటీ అసోసియేట్‌ కాన్సెల్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని