ఈసీలో అభిప్రాయ భేదాలు!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈసీలో అభిప్రాయ భేదాలు!

‘మీడియాపై నియంత్రణ’ వ్యాజ్యాల దాఖలు మీద మల్లగుల్లాలు

ఈనాడు, దిల్లీ: మీడియాపై నియంత్రణ తదితర అంశాలపై మద్రాస్‌ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఎన్నికల సంఘం(ఈసీ) ఇటీవల దాఖలు చేసిన వ్యాజ్యాలకు సంబంధించి అంతర్గతంగా ఈసీలో తీవ్ర అభిప్రాయభేదాలు కనిపిస్తున్నాయి. ‘‘మద్రాస్‌ హైకోర్టులో తొలుత విజ్ఞాపన.. అనంతరం సుప్రీంకోర్టులో ప్రత్యేక లీవ్‌ పిటీషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు అంశాలపై ఈసీలో అంతర్గతంగా ఏకగ్రీవ ఆమోదం లభించలేదు. మద్రాస్‌ హైకోర్టులో దాఖలు చేసిన ప్రమాణపత్రంలోను.. ఎస్‌ఎల్‌పీలోను పేర్కొన్న విషయాలకు సంబంధించి మీడియాపై నియంత్రణ అంశానికి వ్యతిరేకంగా ఎన్నికల కమిషనర్లలో ఒకరు అభ్యంతరం తెలిపారు. అయితే ఆయన అభిప్రాయాన్ని(ఫీడ్‌బ్యాక్‌) పట్టించుకోలేదు’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఓ కేసు విచారణ సందర్భంగా ఇటీవల మద్రాస్‌ హైకోర్టు ఈసీపై పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కరోనా కేసుల వ్యాప్తికి ఈసీయే కారణమని, సంబంధిత అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలని వ్యాఖ్యానించింది. దీంతో ఈ వ్యాఖ్యలు మీడియాలో రాకుండా నియంత్రించాలని కోరుతూ ఈసీ మద్రాస్‌ హైకోర్టులో విజ్ఞాపన దాఖలు చేయగా విచారణకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఈసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మొత్తం వ్యవహారాల్లో వ్యాజ్యాల దాఖలుకు సంబంధించి ఈసీలో అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘంలో ప్రస్తుతం సుశీల్‌ చంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గాను, రాజీవ్‌ కుమార్‌ ఎన్నికల కమిషనర్‌గాను ఉన్నారు. మరో ఎన్నికల కమిషనర్‌ పదవి ఖాళీగా ఉంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని