బిట్టు శ్రీనుకు ఆ కారెక్కడిది?
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బిట్టు శ్రీనుకు ఆ కారెక్కడిది?

పుట్ట మధును ప్రశ్నించిన పోలీసులు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి: పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్టు బాధ్యతలు నిర్వహిస్తున్న బిట్టు శ్రీనుకు ఖరీదైన కారు ఎక్కడి నుంచి వచ్చిందని పుట్ట మధును రామగుండం పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. శనివారం రామగుండం కమిషనరేట్‌లో అడ్మిన్‌ డీసీపీ అశోక్‌ నేతృత్వంలో రోజంతా విచారణ చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గట్టు కిషన్‌రావు ఐజీకి ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించిన అంశాలపై పోలీసులు లోతుగా ప్రశ్నించారు. బిట్టు శ్రీను కారుతో పాటు మంథనిలో అత్యంత ఖరీదైన భవనం నిర్మించడంలో మేనమామ అయిన మధు పాత్ర గురించి ఆరా తీశారు. కేసులో ప్రధాన నిందితుడైన కుంట శ్రీనివాస్‌ గుంజపడుగులో నిర్మిస్తున్న ఇంటికి ఎవరు డబ్బులు సమకూరుస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఇంటికి ఎలాంటి అనుమతులు లేవంటూ వామన్‌రావు గతంలో కోర్టులో కేసు వేశారు. రూ.2 కోట్ల సుపారీ కుదుర్చుకున్నారనే ఆరోపణలు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన విషయాలనూ పోలీసులు ఆరా తీశారని తెలిసింది.

రెండు బృందాలు విచారిస్తున్నాయి
-వి.సత్యనారాయణ, రామగుండం పోలీస్‌ కమిషనర్‌

పుట్ట మధు, పుట్ట శైలజ, పూదరి సత్యనారాయణలపై కిషన్‌రావు గత నెల 16న ఐజీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేదని మరోసారి ఐజీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పుట్ట మధుకు నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని భావించాం. ఈలోగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఒకటి రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తారని భావించాం. ఆచూకీ తెలియకపోవడం, ఫోన్‌లు స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండటం, పరారైనట్లు తెలియడంతో ఆయన కోసం గాలించాం. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్ర ప్రాంతాల్లో ఆయన వాహనాలు, చరవాణులు మారుస్తున్నట్లు గుర్తించాం. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి భీమవరంలో పట్టుకున్నాం. ఆ ప్రాంతానికి చెందిన ఓ చేపల వ్యాపారి వద్ద ఉన్నట్లు గుర్తించి అదుపులో తీసుకున్నాం. రెండు బృందాలు పుట్ట మధును అన్ని కోణాల్లో విచారిస్తున్నాయి. విచారణలో వెల్లడైన విషయాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని