IMD: ‘నైరుతి’ ఆగమనం

ప్రధానాంశాలు

IMD: ‘నైరుతి’ ఆగమనం

అండమాన్‌లోకి ప్రవేశం

దిల్లీ: నైరుతి రుతుపవనాలు అండమాన్‌, నికోబార్‌ దీవుల్లోకి ప్రవేశించినట్లు భారత వాతావారణ పరిశోధన శాఖ (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. త్వరలోనే రుతుపవనాలు కేరళను తాకనున్నాయని చెప్పడానికి ఇది స్పష్టమైన సంకేతంగా పేర్కొంది. ‘‘దక్షిణ బంగాళాఖాతంలోని వివిధ ప్రాంతాలు, నికోబార్‌ దీవులు, పూర్తిస్థాయిలో దక్షిణ అండమాన్‌ సముద్రం, ఉత్తర అండమాన్‌ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ఈనెల 21న ప్రవేశించాయి’’ అని ఐఎండీ వెల్లడించింది. దేశంలో 4 నెలల వర్షపాత కాలం ప్రారంభానికి ఇది సూచిక. ఈ నెల 31న నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ గత వారం అంచనా వేసిన సంగతి తెలిసిందే.

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
హైదరాబాద్‌: ఈ నెలాఖరుకల్లా కేరళ తీరాన్ని తాకే రుతుపవనాలు ఆపై వారం, పదిరోజుల్లో తెలంగాణలోకి విస్తరిస్తాయని అంచనా. బంగాళాఖాతం తూర్పు, మధ్య ప్రాంతంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలుల ప్రభావంతో శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని