జమ్ములో రూ.33.22 కోట్లతో శ్రీవారి ఆలయం
close

ప్రధానాంశాలు

జమ్ములో రూ.33.22 కోట్లతో శ్రీవారి ఆలయం

దేవస్థాన సముదాయానికి తితిదే భూమిపూజ
రూ.33 కోట్లతో నిర్మాణం.. 18 నెలల్లో పూర్తి

తిరుమల, న్యూస్‌టుడే: జమ్ము సమీపంలోని మజీన్‌ గ్రామంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఆదివారం ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి యాగశాలలోని కలశ జలాలను శంకుస్థాపన ప్రాంతానికి తీసుకువచ్చి శిలను అభిషేకించారు. అనంతరం అర్చకులు అక్కడ శిలాన్యాస పూజ చేశారు. మహావిష్ణువును ఆరాధించి శిలను భూమిలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ జుగల్‌ కిషోర్‌ శర్మ, రామ్‌మాధవ్‌, తితిదే పాలక మండలి సభ్యులు గోవింద హరి పాల్గొన్నారు. శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం తితిదేకు 62.10 ఎకరాల భూమి కేటాయించడంతో ఆలయ నిర్మాణానికి రూ.33.22 కోట్లతో పనులు చేపట్టడానికి అనుమతులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

కొవిడ్‌ ముగిశాక కశ్మీర్‌ ప్రగతిపై దృష్టి: కిషన్‌రెడ్డి
జమ్ము: ఆర్టికల్‌ 370ని రద్దు చేసి, జమ్మూ కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాక వివిధ అభివృద్ధి పనులకు కేంద్రం పథక రచన చేసిందని, కొవిడ్‌ ఉద్ధృతి కారణంగా అమలులో జాప్యం జరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు.  ఈ ప్రాంతంలో బాలాజీ ఆలయ నిర్మాణం ఓ మేలుమలుపుగా అభివర్ణించారు. తద్వారా లోయలో ఆధ్యాత్మిక పర్యాటకం పెరుగుతుందని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని