వెయ్యి పేజీల పుస్తకం 20 క్షణాల్లో అనువాదం

ప్రధానాంశాలు

వెయ్యి పేజీల పుస్తకం 20 క్షణాల్లో అనువాదం

 ప్రధాని ఆకాంక్షను నెరవేర్చిన తెలుగు యువకుడు

ఏఐసీటీఈ ఏఐ ట్రాన్స్‌లేషన్‌ టూల్‌ ఆవిష్కరణలో కీలకపాత్ర

ఈనాడు, విశాఖపట్నం: ఇతర భాషల్లోని పుస్తకాలు, గ్రంథాలను చదవడం, వాటిని అర్థం చేసుకోవడం క్లిష్టమైన వ్యవహారమే. అందుకోసం వాటి అనువాదాలు వచ్చే వరకూ వేచి ఉండక తప్పదు. ఈ పరిస్థితి బాధాకరమని, క్షణాల్లో అనువాదం చేసే సాంకేతికతను అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర విద్యాశాఖ అధికారులకు సూచించారు. దిల్లీలోని ఏఐసీటీఈలో ముఖ్య సమన్వయ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న విశాఖకు చెందిన బుద్ధా చంద్రశేఖర్‌ ప్రధాని ఆకాంక్షలకు అనుగుణంగా ఈ అనువాద సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని నిర్ణయించుకున్నారు. ఇంజినీరింగ్‌ పట్టభద్రుడైన ఆయన అమెరికాలో ఎంబీఏ చేశారు. గత ఆరు నెలలుగా ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థులతో కలిసి ‘ఏఐసీటీఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ ట్రాన్స్‌లేషన్‌ టూల్‌’ను రూపొందించారు. ఎంత పెద్ద పుస్తకాన్నయినా కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో క్షణాల్లో అనువదించే ఈ టూల్‌ను ప్రధాని మోదీ గురువారం ఆవిష్కరించారు. ఇది 90 శాతం కచ్చితత్వంతో ఎలాంటి పుస్తకాన్నయినా 12 భాషల్లోకి అనువదించగలదు. సుమారు వెయ్యి పేజీల పుస్తకాన్ని ఒక భాషలోకి అనువదించడానికి 20 సెకన్ల సమయం పడుతుంది. ఆ సాఫ్ట్‌వేర్‌ సాయంతో ఆంగ్లం నుంచి హిందీ, ఒడియా, తెలుగు, తమిళం, మరాఠీÈ, గుజరాతీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ, పంజాబీ భాషల్లోకి అనువాదం చేసుకోవచ్చు. ఆ 12 భాషల్లో ఏ భాషలో ఉన్న పుస్తకాన్నయినా మిగిలినవాటిలోకి కూడా క్షణాల్లో అనువదించవచ్చు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని