లీకేజీల సుంకేసుల

ప్రధానాంశాలు

లీకేజీల సుంకేసుల

తెలుగు రాష్ట్రాల్లో అటు కర్నూలు, ఇటు జోగులాంబ గద్వాల జిల్లాలకు తాగు, సాగునీటి అవసరాలు తీరుస్తున్న సుంకేసుల జలాశయం మరమ్మతుల విషయంలో నిరాదరణకు గురవుతోంది. దీనికి 31 గేట్లు ఉండగా.. చాలావాటికి లీకేజీల వల్ల నీరు వృథాగా పోతోంది. వరద వచ్చినప్పుడు గేట్లను పైకెత్తడానికి ఉపయోగించే రూఫ్‌ తీగలు కొన్ని తెగిపోయాయి. 27వ గేటుకు అసలు తీగలే లేకపోగా 29వ గేటుకు రెండువైపులా తెగిపోయాయి. గతంలో వరద వచ్చినప్పుడు పైకి లేవకుండా మొరాయించిన సందర్భాలున్నాయని స్థానిక రైతులు ‘ఈనాడు’కు తెలిపారు. వీటికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. దీనిపై డ్యాం జేఈ శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా.. గేట్ల రూఫ్‌ తీగలు తెగినది వాస్తవమేనన్నారు. అయిదేళ్లుగా కొత్తవి వేయలేదని, వాటికి సంబంధించి టెండర్లప్రక్రియ జరుగుతోందన్నారు. ఇది పూర్తయితే మరమ్మతులు చేపడతామన్నారు.

- ఈనాడు, మహబూబ్‌నగర్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని