ఆదాయపు పన్ను రిఫండ్‌ వస్తుందంటే.. మోసపోకండి

ప్రధానాంశాలు

ఆదాయపు పన్ను రిఫండ్‌ వస్తుందంటే.. మోసపోకండి

హెచ్చరించిన కేంద్ర సైబర్‌ భద్రత విభాగం

దిల్లీ: ఆదాయపు పన్ను శాఖ నుంచి రిఫండ్‌ అంటూ మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌కు ఎస్సెమ్మెస్‌లు వస్తున్నాయా..! అయితే జాగ్రత్తగా ఉండండి. ఎస్సెమ్మెస్‌ లింకులను క్లిక్‌ చేసి తెరవాలని చూడకండి. చూశారో.. మీ ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారంతో పాటు, బ్యాంకింగ్‌ వివరాలూ హ్యాకర్లకు చేరే అవకాశం ఉంది. మీ బ్యాంక్‌ ఖాతాలో డబ్బు మాయమయ్యే ప్రమాదం ఉంది. ఈ మేరకు కేంద్ర సైబర్‌ భద్రత విభాగం.. దేశవ్యాప్తంగా ఆండ్రాయిడ్‌ ఫోన్లు ఉపయోగిస్తున్న బ్యాంకింగ్‌ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే 27 ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకులు ఈ వైరస్‌ దాడికి లోనయ్యాయని, దేశ సైబర్‌ భద్రతను పర్యవేక్షించే ది ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్‌టీ) తెలిపింది.

ట్రోజన్‌ ఎలా దాడి చేస్తుందంటే..

ఆదాయపు పన్ను(ఐటీ) రిఫండ్‌ అంటూ మీ మొబైల్‌కు ఎస్సెమ్మెస్‌ రూపంలో సందేశం వస్తుంది. అందులోని లింకు నొక్కగానే మీ వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతుంది. వెరిఫికేషన్‌ పూర్తి చేయడానికి యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకోమంటోంది. అది ఆదాయపు పన్ను శాఖ యాప్‌లానే మనల్ని భ్రమింపచేస్తుంది. దాన్ని ఇన్‌స్టాల్‌ చేసుకొనే సమయంలో కాంటాక్టులు, ఫొటోలు, ఎస్సెమ్మెస్‌ తదితర అనుమతులను కోరుతుంది. అవి పూర్తి చేసిన తర్వాత మీ ఆధార్‌, పాన్‌ నంబర్‌, చిరునామా, మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ చిరునామా, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌, సీఐఎఫ్‌ అంకె, డెబిట్‌ కార్డు నంబర్‌, సీవీవీ, పిన్‌ తదితర వివరాలను నింపమంటుంది. వాటిని పూర్తి చేసిన తర్వాత మీకు వచ్చే ఆదాయపు పన్ను రిఫండ్‌ వివరాలు తెరపై కనపడతాయి. సొమ్మును బ్యాంక్‌ ఖాతాకు బదిలీ చేస్తామని పేర్కొంటుంది. ప్రొసీడ్‌ అని మీరు నొక్కగానే ‘ఎర్రర్‌’ అంటూ సందేశం వస్తుంది. వెంటనే అప్‌డేట్‌ చేయమని అడుగుతుంది. అప్‌డేట్‌ జరుగుతుండగానే.. ట్రోజన్‌ మాల్‌వేర్‌ చాపకింద నీరులా తన పని తాను చేసుకుపోతుంది. హ్యాకర్‌కి వినియోగదారుడి ఫోన్‌లోని పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఆ తర్వాత హ్యాకర్‌.. ఆ వివరాలను వాడుకుంటూ సంబంధిత బ్యాంక్‌ స్క్రీన్‌ను వినియోగదారుడికి పంపుతాడు. మొబైల్‌ బ్యాంకింగ్‌ లాగిన్‌ తదితర వివరాలను మీరు ఎంటర్‌ చేయగానే హ్యాకర్‌ తన పని ప్రారంభించి.. బ్యాంక్‌ ఖాతాలోని మొత్తాన్ని ఖాళీ చేస్తాడు.

ఎలా జాగ్రత్త పడాలి?

యాప్‌లను అధికారిక ఆండ్రాయిడ్‌ యాప్‌ స్టోర్స్‌ నుంచి మాత్రమే డౌన్‌లోడ్‌ లేదా అప్‌డేట్‌ చేసుకోవాలి. సురక్షిత బ్రౌజింగ్‌ టూల్స్‌నే వాడాలి. లింకును క్లిక్‌ చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రౌజర్‌లోని చిరునామా బార్‌లో గ్రీన్‌లాక్‌ను క్లిక్‌ చేసి ఎన్‌క్రిప్షన్‌ ధ్రువపత్రాలను తనిఖీ చేసుకోవాలి. మీ బ్యాంక్‌ ఖాతాలో ఎలాంటి అనుమానాస్పద చర్య కనిపించినా తక్షణమే ‘’౯్మi- వెబ్‌సైటులోకి వెళ్లి i-‘i్ట’-్మజీ‘’౯్మi-.్న౯్ణ.i- లో ఫిర్యాదు చేయాలి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని