నల్లకోటుపై టెక్కీల మోజు

ప్రధానాంశాలు

నల్లకోటుపై టెక్కీల మోజు

న్యాయవిద్య వైపు మొగ్గు చూపుతున్న ఇంజినీర్లు

ఈనాడు, హైదరాబాద్‌: బీటెక్‌ పూర్తి చేసిన అభ్యర్థులు న్యాయ విద్యలోనూ ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈసారి మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో చేరేందుకు నిర్వహించిన లాసెట్‌లో 2,861 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇటీవల లాసెట్‌ ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈసారి 29,629 మంది పరీక్ష రాయగా వారిలో 20,398 మంది కనీస మార్కులు సాధించి కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. వారిలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలోనే 14,017 మంది ఉన్నారు. అందులో అత్యధికంగా బీకాం విద్యార్హతతో పరీక్ష రాసిన వారిలో 4,136 మంది అర్హత సాధించారు. ఏదైనా డిగ్రీ చదివిన వారు న్యాయవిద్య చేసేందుకు అర్హులు. అయితే బీటెక్‌తోపాటు బీఫార్మసీ విద్య పూర్తి చేసిన వారూ లాసెట్‌ రాసి న్యాయ విద్య చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు లాయర్‌గా ప్రాక్టీస్‌ చేసేందుకు లాసెట్‌ రాస్తారని, ఎక్కువ మంది న్యాయ పరిజ్ఞానం కోసం చదువుతున్నారని ఆచార్యులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా చార్టెర్డ్‌ అకౌంటెంట్లు బీకాం విద్యార్హతతో ఎక్కువ మంది లా కోర్సులో చేరుతున్నారని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగతంగా న్యాయపరమైన సమస్యలు ఎదురైన వారు పరిష్కారం కోసం న్యాయ విద్యను చదువుతున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని