4 మండలాల్లో దళితబంధుకు రూ. 250 కోట్లు

ప్రధానాంశాలు

4 మండలాల్లో దళితబంధుకు రూ. 250 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: దళితబంధు అమలు కోసం నాలుగు మండలాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 250 కోట్లను సోమవారం విడుదల చేసింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలానికి రూ. 100 కోట్లు, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలానికి రూ. 50 కోట్లు, నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చారగొండ మండలానికి మరో రూ. 50 కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌ మండలానికి రూ. 50 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల జారీచేయడానికంటే ముందే ఈ నిధుల విడుదలకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణభవన్‌లో మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెరాసలో చేరిన సందర్భంలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలయ్యాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని