TS News: మగ్గం మలచిన జీన్స్‌.. కమలాపూర్‌ సంఘంలో తొలిసారిగా తయారీ

ప్రధానాంశాలు

TS News: మగ్గం మలచిన జీన్స్‌.. కమలాపూర్‌ సంఘంలో తొలిసారిగా తయారీ

ఈనాడు, వరంగల్‌: జీన్స్‌ వస్త్రాలు ఫ్యాషన్‌కు మారుపేరు. ఇప్పుడు చేనేతలోనూ తొలిసారిగా జీన్స్‌ వచ్చేసింది. సాధారణ రకానికి ఏమాత్రం తీసిపోని విధంగా హనుమకొండ జిల్లా కమలాపూర్‌ చేనేత సంఘంలో నేతన్నలు ఈ జీన్స్‌ను చేనేత మగ్గంపై నేశారు.  రాష్ట్ర చేనేత జౌళి శాఖ ప్రత్యేక దృష్టిసారించి ఉత్పత్తి వైవిధ్యాన్ని (ప్రోడక్ట్‌ డైవర్సిఫికేషన్‌) ప్రోత్సహించి నిపుణులతో శిక్షణ ఇప్పిస్తోంది. ఈ క్రమంలో కమలాపూర్‌ చేనేత సంఘం వారు నిజాం కాలంలో సంపన్న కుటుంబీకులు ధరించే హిమ్రూ నమూనా దుస్తులు, చీరలు నేసి గత సంవత్సరం పురస్కారాలు సైతం అందుకున్నారు. ప్రస్తుతం మార్కెట్లో గిరాకీ ఉన్న దుస్తులపై దృష్టి పెట్టి జీన్స్‌ వస్త్రాన్నీ నేయడం నేర్చుకొన్నారు. గత మూడు నెలల నుంచి మగ్గంపై వీటిని నేస్తూ వైవిధ్యమైన దారిలో సాగుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన పలు దుకాణదారులు ప్రత్యేకంగా ఆర్డర్‌ ఇచ్చి ఈ ఉత్పత్తిని మార్కెట్లో విక్రయిస్తున్నారు. హనుమకొండ జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి రవీందర్‌ మాట్లాడుతూ.. ఇది అచ్చమైన కాటన్‌ జీన్స్‌ అని, ధరించేందుకు ఎంతో అనువుగా ఉంటుందని చెప్పారు. మీటరు రూ.300 చొప్పున అనేక ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని