ఆ మూడు దేశాల నుంచే 213 స్ట్రెయిన్‌ కేసులు..

తాజా వార్తలు

Published : 01/03/2021 19:18 IST

ఆ మూడు దేశాల నుంచే 213 స్ట్రెయిన్‌ కేసులు..

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది.  రోజూవారీ కేసులు కొంతమేరకు తగ్గాయి. అయితే యూకే, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్‌ కరోనా స్ట్రెయిన్‌ కేసులు దేశంలో పెరిగిపోతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. యూకే స్ట్రెయిన్‌ 19 కొత్త  కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు ఆ దేశం నుంచి వచ్చిన వారిలో మొత్తంగా 187 మంది వైరస్‌ బారిన పడ్దారని అధికారులు తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారిలో ఆరుగురు,  బ్రెజిల్‌ నుంచి వచ్చిన వారిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. మొత్తంగా  213 కరోనా కేసులు నమోదయినట్లు వివరాలు వెల్లడించారు. దీంతో అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు కరోనాపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కొన్ని నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. యూకే, మధ్య ఆసియా, యూరప్‌ మినహా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరు తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. 
బ్రిటన్‌, సౌత్‌ ఆఫ్రికా, బ్రెజిల్‌లలో బయటపడిన కరోనా వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న వ్యాక్సిన్‌ ఈ వైరస్‌లపై అంతగా ప్రభావం చూపకపోవచ్చని సంస్థ తెలిపింది. యూకే స్ట్రెయిన్‌ కన్నా సౌత్‌ ఆఫ్రికా, బ్రెజిల్‌ వైరస్‌లు అత్యంత ప్రభావవంతమైనవని నిపుణులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వైరస్‌లను నియంత్రించడానికి ప్రయోగాలు జరుగుతున్నట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) చీఫ్‌ బలరామ్‌ భార్గవ తెలిపారు. ఇదిలా ఉంటే.. కేరళ, పంజాబ్‌, మహారాష్ట్రలలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 15 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో వ్యాక్సిన్‌ పంపిణీని వేగవంతం చేయాలని, రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 30 కోట్ల మందికి టీకా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని