close

తాజా వార్తలు

Published : 18/01/2021 21:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

#డే3: 1.48 లక్షల మందికి వ్యాక్సిన్‌

దిల్లీ: దేశంలో కొనసాగుతున్న టీకా పంపిణీ కార్యక్రమం మూడో రోజు విజయవంతంగా జరిగిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 3,81,305 మంది కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకున్నారని తెలిపింది. ఇందులో కేవలం 580 మందిలో మాత్రమే స్వల్ప ఇబ్బందులు తలెత్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. అంతే తప్ప వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల ఏ ఒక్కరూ మరణించలేదని స్పష్టంచేసింది. ఈ మేరకు ఆ శాఖ అదనపు కార్యదర్శి మనోహర్‌ అగ్‌నానీ సోమవారం మీడియాతో మాట్లాడారు. 

దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా సోమవారం (సాయంత్రం 5 గంటల సమయానికి) కొత్తగా మరో 1,48,266 మందికి టీకాలు వేసినట్లు మనోహర్‌ తెలిపారు. మొత్తం 25 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో టీకా పంపిణీ జరిగిందని చెప్పారు. ఏపీలో 9,758 మందికి, తెలంగాణలో 10,352 మంది ఆరోగ్య కార్యకర్తలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు వెల్లడించారు. యూపీ, కర్ణాటకలో ఒక్కొక్కరు మరణించినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. యూపీకి చెందిన వ్యక్తి వ్యాక్సిన్‌ వల్ల మరణించలేదని స్పష్టంచేశారు. కర్ణాటకకు చెందిన వ్యక్తి ఇతర కారణాలతో మరణించారని, పోస్ట్‌మార్టం నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. 

మూడో రోజు టీకా పంపిణీ.. రాష్ట్రాల వారీగా:

ఇవీ చదవండి..
పాక్‌లో మోదీకి జేజేలు.. ఎందుకంటే..
వ్యాక్సిన్‌ తీసుకున్న వైద్యులు ఏం చెబుతున్నారు?



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని