close
Array ( ) 1

తాజా వార్తలు

PICS: కేజ్రీ ప్రమాణస్వీకారంలో బుడ్డోడి సందడి

దిల్లీ: ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకార కార్యక్రమంలో బుల్లి ‘మఫ్లర్‌ మ్యాన్‌’ సందడి చేశాడు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజు సామాజిక మాధ్యమాల్లో విశేష ప్రాచుర్యం పొందిన ఆవ్యన్‌ తోమర్‌.. ప్రమాణస్వీకార కార్యక్రమంలోనూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ కార్యక్రమానికి ఈ బుడ్డోడిని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రత్యేక అతిథిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ప్రమాణస్వీకారానికి వచ్చిన బుల్లి కేజ్రీవాల్‌ను చూసేందుకు ప్రమాణస్వీకారానికి వచ్చిన వారు ఎగబడ్డారు. వేదిక వద్ద ఈ చిన్నారి చేసిన సందడి కెమెరాల్లో బంధించేందుకు మీడియా ప్రతినిధులు సైతం ఆసక్తి కనబరిచారు. ఆప్‌ ఎమ్మెల్యేలు భగవంత్‌మాన్‌, రాఘవ్‌ చద్దా, సోమ్‌నాథ్‌ భారతి పిల్లాడిని ముద్దుచేశారు. చిన్నారితో సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో మరికొందరు చిన్నారులు కూడా కేజ్రీవాల్‌ను అనుకరిస్తూ దుస్తులు ధరించి కార్యక్రమానికి వచ్చి ప్రత్యేకాకర్షణగా నిలిచారు.

ఇదీ చదవండి..

ప్రధాని ఆశీస్సులు కావాలి: కేజ్రీవాల్‌


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.