close
Array ( ) 1

తాజా వార్తలు

ఆసుపత్రిలో చేరిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌

లండన్‌: కరోనా వైరస్‌ సోకిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను ఆదివారం ఆసుపత్రికి తరలించారు. గత ఏడు రోజులుగా ఆయన స్వీయ నిర్బంధంలో ఉండి చికిత్స పొందుతున్నప్పటికీ.. ఇంకా కొన్ని వైరస్‌ లక్షణాలు ఉన్నాయని అందుకే ఆసుపత్రికి తీసుకెళ్లామని ఓ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆయన వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు ముందు జాగ్రత్తగానే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఉష్ణ్రోగ్రత ఇంకా తగ్గట్లేదు.. బోరిస్‌

గతవారం ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఏడు రోజుల తర్వాత బయటకు రావొచ్చని వైద్యులు సూచించినప్పటికీ.. ఆయనలో ఇంకా కొన్ని వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో నిర్బంధాన్ని మరికొన్ని రోజులు పొడగించుకున్నట్లు ఆయనే స్వయంగా వీడియో సందేశం ద్వారా తెలిపారు. ‘‘నా ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గానే ఉంది. నా ఏడు రోజుల నిర్బంధం కూడా పూర్తయింది. అయినా, నాలో ఇంకా స్వల్పంగా వైరస్‌ లక్షణాలు ఉన్నాయి. ఇంకా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లక్షణాలు పూర్తిగా తొలగిపోయేంత కాలం నేను స్వీయ నిర్బంధంలో ఉంటాను’’ అని జాన్సన్‌ తెలిపారు.  

ఒక్కరోజే 621 మరణాలు..

బ్రిటన్‌లో వైరస్‌ విజృంభణ ఇప్పట్లో తగ్గే సూచనలు ఏమీ కనబడట్లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇప్పటికే అమలులో ఉన్న షట్‌డౌన్‌ ఆంక్షల్ని మరింత కఠినతరం చేశారు. ప్రజలు ప్రభుత్వ ఆదేశాల్ని కచ్చితంగా పాటించకపోతే బహిరంగ వ్యాయామాలపైనా నిషేధం విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. బ్రిటన్‌లో 24 గంటల్లో 5,903 కేసులు పెరిగినట్లు ఆదివారం సాయంత్రం అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు వైరస్‌ సోకినవారి సంఖ్య 47,806కు పెరిగింది. ఆదివారం ఒక్కరోజే 621 మంది మృత్యువాత పడడంతో మరణాల సంఖ్య 5,914కు చేరింది.

బోరిస్‌ త్వరగా కోలుకుంటారు.. ట్రంప్‌

ఆసుపత్రిలో చేరిన బోరిస్‌ జాన్సన్‌ త్వరగా కోలుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆకాంక్షించారు. అమెరికా ప్రజలంతా బోరిస్‌ ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తున్నారన్నారు. బోరిస్‌ను దృఢమైన మనిషిగా.. గొప్ప నేతగా.. అభివర్ణించిన ట్రంప్‌ ఆయన ఆరోగ్యం మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి...

వైరస్‌కు ఉక్కపోత?

ట్రంప్‌నూ ఫౌచిలో పెట్టేశాడు!


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.