భారత్‌ : ఒక్కరోజే 39,000 కేసులు!

తాజా వార్తలు

Updated : 19/07/2020 10:28 IST

భారత్‌ : ఒక్కరోజే 39,000 కేసులు!

గడిచిన వారంలోనే 4000 మంది మృతి
దేశంలో 26,816కు చేరిన కొవిడ్‌ మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గడిచిన వారంరోజులుగా నిత్యం 30వేలకుపైగా రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే కొత్తగా 38,902 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దేశంలో ఒక్కరోజే ఈ స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్‌ బారినపడిన వారిసంఖ్య 10,77,618కు చేరింది. నిన్న ఒక్కరోజే మరో 543మంది కరోనా రోగులు ప్రాణాలువిడిచారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 26,816కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొవిడ్‌ సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 6,77,423 మంది కోలుకోగా, మరో 3,73,379 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 63శాతంగా ఉంది.

గడిచిన వారంరోజుల్లోనే 4వేల మరణాలు..!
గడిచిన వారం రోజులుగా దేశంలో కరోనా మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత ఆదివారం దేశంలో కరోనా మరణాల సంఖ్య 22,674గా ఉండగా ప్రస్తుతం అది 26,816కు చేరింది. దేశవ్యాప్తంగా నిత్యం దాదాపు 500మందికి పైగా కొవిడ్‌ రోగులు మృతిచెందుతున్నారు. దీంతో ఈ వారం రోజుల్లోనే 4142 మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.

రోజువారీ కేసుల్లో అమెరికా తర్వాత భారత్‌..
రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో ప్రపంచంలో అత్యధికంగా అమెరికాలో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నిత్యం అక్కడ 70వేల పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. అమెరికా తర్వాతి స్థానంలో ప్రస్తుతం భారత్‌ కొనసాగుతోంది. భారత్‌లో రోజువారీ కేసుల సంఖ్య 39వేలకు చేరువవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక అత్యధిక కరోనా కేసుల జాబితాలో 37లక్షలతో అమెరికా తొలిస్థానంలో ఉండగా భారత్‌ మూడోస్థానంలో కొనసాగుతోంది. మరణాల్లో మాత్రం భారత్‌ ఎనిమిదో స్థానంలో ఉంది. 

ఇవీ చదవండి..
బీసీజీ టీకా కరోనా నుంచి రక్షిస్తుందా?
ఇరాన్‌లో 2.5కోట్ల మందికి కరోనా!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని