close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 02/06/2020 23:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మనుశర్మ విడుదల

దిల్లీ: దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం సృష్టించిన మోడల్‌ జెస్సికా లాల్‌ హత్యకేసులో జీవిత ఖైదు పడిన మనుశర్మ మంగళవారం జైలు నుంచి విడుదలయ్యాడు. సత్ప్రవర్తన కారణంగా అతడిని విడుదల చేసేందుకు దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ ఆమోదం తెలపడంతో తీహార్‌ జైలు నుంచి బయటికొచ్చాడు. మను శర్మ విడుదలకు సంబంధించి దిల్లీ సెంటెన్స్‌ రివ్యూ బోర్డు (ఎస్‌ఆర్‌బీ) గత నెల చేసిన సిఫార్సు మేరకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ విడుదలకు అనుమతిచ్చారు.

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత వినోద్‌ శర్మ కుమారుడే ఈ మనుశర్మ. తనకు మద్యం సరఫరా చేసేందుకు తిరస్కరించిందన్న కారణంతో ఓ రెస్టారెంట్‌లో మోడల్‌ అయిన జెస్సికా లాల్‌ను 1999 ఏప్రిల్‌ 30న మనుశర్మ కాల్చి చంపాడు. ఈ కేసులో తొలుత మనుశర్మను విచారణ కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. మీడియా నుంచి ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దర్యాప్తు తిరిగి నిర్వహించారు. దిల్లీ హైకోర్టు మనుశర్మకు 2006లో జీవిత ఖైదు విధించింది. సుప్రీం కోర్టు కూడా ఈ జీవిత ఖైదును సమర్థించింది. హై ప్రొఫైల్‌ కేసుగా అప్పట్లో సంచలనం సృష్టించింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.