దిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తాజా వార్తలు

Published : 28/10/2020 22:01 IST

దిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తొలిసారి 5వేల మార్కు దాటాయ్‌!

దిల్లీ‌: దేశ రాజధాని నగరంపై కరోనా వైరస్‌ ఉగ్రరూపం చూపుతోంది. గతంలో తగ్గినట్టే కనిపించిన ఈ మాయదారి మహమ్మారి మళ్లీ అక్కడ కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా 24 గంటల్లోనే 5,600లకు పైగా కొత్త కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది. దేశంలో కరోనా ప్రవేశించిన తర్వాత దిల్లీలో ఒక్కరోజు వ్యవధిలోనే 5వేల మార్కును దాటడం ఇదే ప్రథమం. గత కొన్ని రోజులుగా 4వేలకు పైగా కేసులు చొప్పున నమోదవుతున్నప్పటికీ బుధవారం 60,571 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 5,673 కొత్త కేసులు రావడం కలవరపెడుతోంది. 

దిల్లీలో తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,70,104కి చేరింది. మరో 40 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 6,396కి పెరిగినట్టు వైద్యశాఖ అధికారులు బులిటెన్‌లో వెల్లడించారు. గతంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులను పరిశీలిస్తే.. నిన్న ఒక్కరోజే 4,853 కేసులు వచ్చాయి. మరోవైపు, దిల్లీలో రికవరీ రేటు కూడా భారీగానే ఉంది. దిల్లీలో ప్రస్తుతం 29,378 క్రియాశీల కేసులు ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని