పరీక్షలు నిర్వహించాల్సిందే: సుప్రీం

తాజా వార్తలు

Updated : 28/08/2020 12:37 IST

పరీక్షలు నిర్వహించాల్సిందే: సుప్రీం

దిల్లీ: వివిధ కోర్సుల్లో చివరి సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు సెప్టెంబరు 30లోగా నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్‌ చేయొద్దని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు రాష్ట్రాలకు, వర్సిటీలకు సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన తర్వాతే పై తరగతులకు ప్రమోట్‌ చేయాలన్న యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మార్గదర్శకాల్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

యూజీసీ మార్గదర్శకాల్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ అశోక్‌భూషణ్‌  నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. చివరి సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. కరోనా దృష్టా పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు ఉంటే యూజీసీని సంప్రదించాలని సూచించింది. పరీక్షల గడువు పెంచాలని రాష్ట్రాలు యూజీసీని కోరవచ్చని స్పష్టం చేసింది.

యూజీసీ మార్గదర్శకాలు ఇవీ...
* చివరి సెమిస్టర్‌ విద్యార్థులకు సెప్టెంబరు పూర్తయ్యేలోపు విశ్వవిద్యాలయాలు పరీక్షలు నిర్వహించాలి. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ పద్ధతుల్లో లేదా రెండింటి కలయికగా పరీక్షలు జరుపుకోవచ్చు. బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులు ఉంటే పరీక్షలు నిర్వహించాలి. వాటిని కూడా పైవిధానంలో జరపాలి.
* ఒకవేళ సెప్టెంబరులో పరీక్షలకు, ఏదైనా ఒక సబ్జెక్టు పరీక్షకు హాజరుకాలేని విద్యార్థులకు మరోసారి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించాలి. ఇది 2019-20 విద్యార్థులకు ఈ ఒక్కసారి మాత్రమే అవకాశం ఇవ్వాలి.
* మిగిలిన సెమిస్టర్ల వారికి గత ఏప్రిల్‌లో సూచించినట్లుగా అంతర్గత పరీక్షలు, గత సెమిస్టర్‌ పరీక్షల మార్కులను పరిగణనలోకి తీసుకొని గ్రేడ్లు ఇచ్చుకోవచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని